Pawan Kalyan Produces Ram Charan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు అంటేనే ఇండస్ట్రీలో ఓ లెజెండ్. తన యాక్టింగ్‌తో ఫ్యాన్స్ ప్రతీ ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన మూవీ వస్తుందంటేనే ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఆయనకు కేవలం యాక్టింగ్‌పైనే కాకుండా రైటింగ్, మూవీ నిర్మాణంపైనా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు.

Continues below advertisement


అబ్బాయ్‌తో మూవీ


అయితే.. మూవీ నిర్మాణం అంటే తనకు చాలా ఇష్టమని పవన్ చెప్పినా.. ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్నా.. తాను కమిట్ అయిన మూవీస్‌ను త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. పవన్ తన బ్యానర్‌ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్'పై త్వరలోనే ఓ మూవీ నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అబ్బాయ్ రామ్ చరణ్‌తో ఈ మూవీ నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం కానున్నారనే టాక్ వినిపిస్తోంది.


క్రేజీ హిట్ కాంబో..


అబ్బాయ్ రామ్ చరణ్.. తన స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హారిక హాసిని నిర్మించే మూవీని పవన్ తన 'క్రియేటివ్ వర్క్స్ బ్యానర్'పై భాగస్వామ్యం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి రామ్ చరణ్‌తో.. పవన్ తన బ్యానర్ మీద సినిమా నిర్మిస్తారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. పవన్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ అంటేనే ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఇదే నిజమైతే వారికి నిజంగా పండుగే అని చెప్పాలి.


Also Read: ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు టాలీవుడ్ పెద్దలు... పవన్ ఎఫెక్ట్... బాలకృష్ణను సంప్రదించి లిస్ట్?


త్రివిక్రమ్‌తో వరుసగా 3 సినిమాలు


'గుంటూరు కారం' మూవీ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ చేయలేదు. ఈ క్రమంలో ఆయన వరుస ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నారు. హారిక హాసిని సంస్థ ఆయనతో వరుసగా 3 సినిమాలు ప్లాన్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్‍తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మాస్ ఎంటర్‌టైనర్, ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో మైథలాజికల్ థ్రిల్లర్స్ ప్లానింగ్‌లో ఉన్నాయి.


ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది'తో బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్‌తో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లోపే వెంకీతో మూవీ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు త్రివిక్రమ్. ఇక బన్నీతో చేయాల్సిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని ఎన్టీఆర్‌తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నాగవంశీ తన ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు. 'అత్యంత శక్తివంతమైన గాడ్స్‌లో ఒకరిగా నాకు ఇష్టమైన అన్నయ్య కనిపించబోతున్నారు', 'గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్' అని ట్వీట్స్ చేయగా.. ఇది ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీయేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుస ప్రాజెక్టులు, క్రేజీ కాంబోలతో మూవీ లవర్స్‌కు నిజంగా పండుగే అని చెప్పాలి.