పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న 'ఓజీ' (They Call Him OG) మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సినిమా నుంచి చిన్న గ్లింప్స్, సాంగ్, ఆఖరికి పోస్టర్ వచ్చిన సరే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఒక రేంజ్‌లో ఉంటోంది. అయితే ఒకటి గమనించారా? ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషలలో మాత్రమే పాటలు గానీ ప్రచార చిత్రాలు గానీ విడుదల అయ్యాయి. అయితే కర్ణాటకలోని పవన్ అభిమానులు కన్నడలోనూ 'ఓజీ' సినిమాను విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. అందుకు తగ్గట్టుగా ఓజీ టీం ప్లాన్ చేస్తోందని తెలిసింది.
కన్నడలోనూ 'ఓజీ' సినిమా విడుదల...బెంగళూరులో డబ్బింగ్ ఆల్మోస్ట్ ఫినిష్!కన్నడలో 'ఓజీ' విడుదల చేయాలని కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. 'మిరాయ్' మూవీ ప్రమోషన్స్ కోసం తేజా సజ్జా బెంగళూరు వెళితే ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులు 'ఓజీ ఓజీ...' అంటూ హంగామా చేశారు. అప్పుడు 'మిరాయ్' విడుదల తర్వాత అందరం 'ఓజీ'కి వెళదామని తేజా సజ్జా చెప్పారు. బెంగళూరులో ఉంటున్న తెలుగు ప్రజలతో పాటు కన్నడిగులలోనూ పవన్ సినిమా చూడాలని ఉంది.
Also Read: రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ అప్డేట్... పాన్ ఇండియా సినిమాతో థియేటర్లలోకి!
కన్నడిగుల రిక్వెస్ట్ 'ఓజీ' టీం వరకు వచ్చింది. దాంతో కన్నడ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. బెంగళూరులో అందుకు సంబంధించిన వర్క్ మొదలైంది. కన్నడలోనూ సినిమా ట్రైలర్ విడుదల కానుందని సమాచారం. సినిమాను కూడా సెప్టెంబర్ 25న కన్నడలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం మీద ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది. త్వరలో ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు.
Also Read: బాలీవుడ్ హీరోతో సాయి దుర్గా తేజ్ ఢీ... 'సంబరాల యేటిగట్టు'లో విలన్‌గా హిందీ స్టార్
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన 'ఓజీ' సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'సాహో' తర్వాత సుజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. మాఫియా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.