రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు అందరికీ ఒక గుడ్ న్యూస్. 'ది రాజా సాబ్' (The Raja Saab) మూవీ రిలీజ్ డిసెంబర్ నుంచి సంక్రాంతికి వెళ్లిందని, తమ ఫేవరెట్ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూడడం కాస్త ఆలస్యం అవుతుందని కొంచెం డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. త్వరలో థియేటర్లలోకి ట్రైలర్ వస్తోంది.
'కాంతార 2'తో రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్!గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలోకి వస్తున్న సినిమాలలో 'కాంతార ఏ లెజెండ్' (Kantara A Legend Release Date) ఒకటి. అక్టోబర్ రెండున సినిమా విడుదల. పాన్ ఇండియా రిలీజ్ అంటే హిందీతో పాటు దక్షిణాది నాలుగు భాషలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాలు విడుదల చేయడం కామన్. ఈ ఐదు భాషలతో పాటు ఇంగ్లీష్, బెంగాలీ వంటి ఇతర భాషలలో కూడా 'కాంతార' విడుదల అవుతోంది. ఆ సినిమాతో 'ది రాజా సాబ్' ట్రైలర్ అటాచ్ చేయనున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
అక్టోబర్ రెండున 'కాంతార' విడుదల అవుతుంది కనుక దానికి ఒక్క రోజు ముందు అక్టోబర్ 1న 'ది రాజా సాబ్' ట్రైలర్ యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా వేదికలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్ పుట్టినరోజు కానుకగా మొదటి పాట!Raja Saab First Single Release On Prabhas Birthday: అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా సినిమాలో మొదటి పాట విడుదల చేయనున్నట్లు విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి సినిమా రానుంది.
Also Read: బాలీవుడ్ హీరోతో సాయి దుర్గా తేజ్ ఢీ... 'సంబరాల యేటిగట్టు'లో విలన్‌గా హిందీ స్టార్
మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సప్తగిరి వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీనుతో పాటు బొమ్మన్ ఇరానీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సినిమా ప్రొడ్యూస్ చేశారు.
Also Read: భుజంపై టాటూ చూపించిన త్రిష... ఆ టాటూ స్పెషాలిటీ ఏమిటో తెలుసా?