ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ మూవీ చివరి షెడ్యూల్లో జాయిన్ అయినట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోని కీలక సన్నివేశాలను ఇప్పటికే విజయవాడలో చిత్రీకరించారు మేకర్స్. పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ని ఎప్పుడెప్పుడు రీస్టార్ట్ చేస్తారా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆయన అభిమానులతో పాటు మేకర్స్ కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా చివరి షెడ్యూల్ ను విజయవాడలో వేసిన సెట్ లో ప్లాన్ చేయగా, రెండు నెలల లాంగ్ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు అంటూ కొత్త పాస్టర్ ద్వారా గుడ్ న్యూస్ ను వెల్లడించారు. "ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం స్టార్ట్" అంటూ పవన్ కళ్యాణ్ అటు తిరిగి నిలబడిన ఫోటోను షేర్ చేశారు. కాగా ఈ మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇదిలా ఉండగాక్రిష్ డైరెక్టర్ గా ముందుగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పలు కారణాల వల్ల 'రూల్స్ రంజన్' ఫేమ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేతికి వెళ్ళింది. ఈ మూవీని రెండు భాగాలుగా చిత్రీకరిస్తుండగా, ఫస్ట్ పార్ట్ కు 'హరిహర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడం విశేషం.
Also Read: RC 16లో 'మీర్జాపూర్' మున్నా భయ్యా.... పోస్టర్‌తో క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చిన Ram Charan టీం
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాక పవన్ కళ్యాణ్ 'ఓజి' మూవీ సెట్ లో అడుగు పెట్టబోతున్నారు. 'హరిహర వీరమల్లు' కంటే ఎక్కువగా 'ఓజి' మూవీ గురించే మెగా అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వచ్చిన అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. వీలైనంత త్వరగా 'హరిహర వీరమల్లు' షూటింగ్ ని పూర్తి చేసి, 'ఓజీ' షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు పవన్. 'ఓజీ' మూవీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టడంతో ఆయనను తెరపై మిస్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ ఆకలిని తీర్చే మూవీ 'ఓజీ'నా , లేదంటే 'హరిహర వీరమల్లు' అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Allu Arjun: అల్లు అర్జున్ మీద పోలీస్ కంప్లైంట్... ఫ్యాన్స్‌ను ఆర్మీ అంటే ఎలా?