Pawan Kalyan Speech In OG Pre Release Event: తాను ఓ డిప్యూటీ సీఎం అన్న విషయాన్ని మర్చిపోయానని... అలా ఎవరైనా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల్లో జోష్ నింపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ వర్షం మధ్యే ఈవెంట్‌లో పవన్ కత్తి పట్టుకుని 'ఓజీ' స్టైల్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీన్ని చూసిన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. పొలిటికల్ లీడర్‌గా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన అభిమానులు, 'OG' మూమెంట్స్ గుర్తు పెట్టుకునేలా ఫుల్ ట్రీట్ ఇచ్చారని అంటున్నారు.

Continues below advertisement

'వాషి యో వాషి' హైకూతో...

ఈవెంట్‌లో పవన్ స్పీచ్‌పైనే అందరి దృష్టి ఉండగా... అనుకున్నట్లుగానే తనదైన గ్రేస్, స్టైల్‌తో పవన్ అదరగొట్టారు. 'వాషి యో వాషి' హైకూతో స్పీచ్ ప్రారంభించారు. డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ట్రిప్‌లో మూవీ చేశారని అందులోకి తనను కూడా లాగేశారని పవన్ అన్నారు. 'సుజీత్ చెప్పేది తక్కువ. కానీ ఆయన వర్క్ మామూలుగా ఉండదు. సుజీత్ విజన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు తమన్. నేను డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయా. సినిమాలు చేస్తే పాలిటిక్స్ గురించి ఆలోచించను. పాలిటిక్స్ చేస్తే సినిమాల గురించి ఆలోచించను.' అని చెప్పారు.

Continues below advertisement

Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది... వర్షంలోనూ ఎల్బీ స్టేడియాన్ని వీడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!

పాలిటిక్స్‌కు వచ్చే వాడిని కాదేమో!

అప్పుడెప్పుడో 'ఖుషీ' మూవీ టైంలో ఉన్న జోష్‌ను ఇప్పుడు చూస్తున్నట్లు చెప్పారు పవన్. 'అప్పట్లో 'ఖుషి' కోసం ఖటానాను ప్రాక్టీస్ చేస్తే... మళ్లీ ఓజీ సినిమాకు చేశాను. ఈ సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నేను పాలిటిక్స్‌లోకి వెళ్లినా నన్ను మీరు వదల్లేదు. పాలిటిక్స్‌లో కానీ మూవీస్‌లో కానీ ఇలా చేస్తున్నానంటే దానికి కారణం మీరే. సుజీత్ పట్టుబట్టి మరీ నాకు జపనీస్ నేర్పించాడు. ప్రియాంక మోహన్ అద్భుతంగా నటించారు. ఓ మంచి లవ్ స్టోరీని ప్రెజెంట్ చేశారు.

ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి నటన కూడా అద్భుతం. భవిష్యత్‌లో శ్రియా రెడ్డితో కలిసి నటిస్తాను. మూవీ టీం అంతా యంగ్. ఇలాంటి టీం కనుక అప్పుడు ఉండుంటే నేను పాలిటిక్స్‌లోకి వచ్చే వాడిని కాదేమో. మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరి పేరు నాకు తెలియకపోవచ్చు. కానీ వారు పడ్డ శ్రమ నాకు తెలుసు. తెలుగోడంటే ఆకాశం ఉరుముతుంది. ' అని అన్నారు. మూవీ టీం అంతా వర్షంలోనే తడుస్తూ స్పీచ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సైతం వర్షంలోనే తడుస్తూ 'మనల్ని ఎవడ్రా ఆపేది. ఓటమి మనల్ని ఆపలేదు. అలాగే వర్షం కూడా ఆపలేదు' అంటూ అభిమానుల్లో జోష్ నింపారు. స్డేడియం మొత్తం జనసంద్రమైంది. మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.