Scenes Trimmed From Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్స్, కొన్ని సీన్స్ సరిగ్గా లేవంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటిపై తాజాగా మూవీ టీం స్పందించింది. మూవీ నుంచి కొన్ని సీన్స్ కట్ చేసి అప్‌డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ సీన్స్ కట్...
మూవీలో బాణం సీన్, ఫ్లాగ్ సీన్ తొలగించడం సహా బండరాయి సీన్‌ను ఫాస్ట్ చేశారు. అలాగే హీరో అతని అనుచరులు కొండ అంచున గుర్రాలపై స్వారీ చేసిన సీన్ కాస్త కుదించారు. దీంతో పాటే జెండా సీన్‌ను పూర్తిగా తొలగించారు. పవన్ బాణం సంధించే యాక్షన్ సీన్‌లో కాస్త మార్పులు చేశారు. అసలైన క్లైమాక్స్ సీన్‌లో కీలక మార్పులు చేశారు. వీరమల్లు, ఔరంగజేబు తుపానులో తలపడే సీన్ తొలగించినట్లు తెలుస్తోంది. 'ఆంధీ వచ్చేసింది' అంటూ ఔరంగజేబు చెప్పే డైలాగ్‌తో మూవీ కంప్లీట్ అవుతుంది. మొత్తం 10 నుంచి 15 నిమిషాల వరకూ సీన్స్ ట్రిమ్ చేసింది మూవీ టీం. ప్రస్తుతం అప్డేట్ చేసిన వెర్షన్‌నే థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రిష్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అరేబియా కడలి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఫ్యాన్స్ రియాక్షన్
మూవీలో కొన్ని అనవసర వీఎఫ్ఎక్స్ సీన్స్ కట్ చేసి మంచి పని చేశారని ఇప్పుడే సినిమా బాగుందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పని ముందే చేసుంటే ఇంకా బాగుండేదని అంటున్నారు. క్రైమాక్స్ సీన్ అదిరిపోయిందని కొందరు పేర్కొంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విమర్శలపై డైరెక్టర్ జ్యోతికృష్ణ స్పందించారు. మూవీలోని కొన్ని సీన్స్‌లో సీజీ వర్క్ బాగాలేదని మాత్రమే కొందరు కామెంట్ చేశారని... ఆ చిన్న సీన్ పట్టుకుని మూవీ మొత్తం బాగాలేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సినిమా ఎంత బాగా వచ్చినా ఏదో ఒక మైనస్ పాయింట్స్ చెబుతూనే ఉంటారని అన్నారు. 'హరిహర వీరమల్లు కోసం 4,399 సీజీ షాట్స్ వాడాం. వాటిలో 4, 5 షాట్స్ బాగా రాకుంటే వాటిని మార్చాం.' అని తెలిపారు.