Pawan Kalyan felicitates Thota Tharani: ప్రముఖ కళా దర్శకులు, 'పద్మశ్రీ' పురస్కార గ్రహీత తోట తరణిని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సత్కరించారు. ఈ ఆత్మీయ సత్కారానికి పవన్ హీరోగా తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ స్పాట్ వేదిక అయ్యింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఈ చిత్రానికి తోట తరణి కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో రూపొందిన సెట్స్‌లో, ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా తోట తరణి సెట్స్‌కు వచ్చారు. అక్కడ ఆయన్ను పవన్ సత్కరించారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "పద్మశ్రీ పురస్కారం, జాతీయ స్థాయి ఉత్తమ కళా దర్శక పురస్కారాలు అందుకున్న శ్రీ తరణి గారి నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన రూపొందించిన సెట్స్ సృజనాత్మక శక్తి, అధ్యయన అభిలాష కు అద్దం పడతాయి. నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి తరణి గారితో పరిచయం ఉంది" అని అన్నారు.
'హరిహర వీరమల్లు' లేటెస్ట్ షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తోదోర్ లాజరోవ్ నేతృత్వంలో పవన్ కల్యాణ్, ఇతర తారాగణంపై యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేయాలని ప్లాన్ చేశారు. వాటి కోసం పవన్ కల్యాణ్ వర్క్ షాప్స్ / ప్రాక్టీస్ సెషన్స్ అటెండ్ అయ్యారు.
Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?
పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read: 'కథ కంచికి మనం ఇంటికి' రివ్యూ: 'చీకటి గదిలో చితకొట్టుడు'తో త్రిగుణ్ మీద పడిన మచ్చ పోతుందా?