హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ విడుదలకు సిద్ధమైంది. యాక్సిడెంట్ వల్ల చాలా రోజులు షూటింగులకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ సుమారు ఏడాదిన్నర తరువాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో ఈ మూవీని తెరకెక్కించారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మంగళవారం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. అయితే, ఇది ఇంకా యూట్యూబ్‌లోకి అందుబాటులోకి రాలేదు. మార్చి 1న టీజర్ రిలీజ్ కానుంది. అయితే, ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు.
పవన్ కళ్యాణ్‌కు భలే నచ్చేసింది
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘వినోదయ సిత్తం’ రీమేక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తేజ్.. ఆ మూవీ సెట్‌లోనే ‘విరూపాక్ష’ టీజర్‌ను పవన్‌కు చూపించారు. టీజర్ బాగుందంటూ, మూవీ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘విరూపాక్ష’ టీమ్‌కు అభినందనలు తెలిపారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే గోల్డెన్ లెగ్ క్రెడిట్ కొట్టేసిన సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్. ‘కాంతార’ మూవీకి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ‘‘భయం, అజ్ఞానం వంటివి మూఢ నమ్మకాలకు కారణభూతంగా మారుతుంటాయి. ఆ నమ్మకం నిజమైనపుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనపుడు.. అసలు నిజం చూపించే జ్ఞాన నేత్రం ఏమిటనే అంశంతో ‘విరూపాక్ష’ మూవీ తెరకెక్కింది. హీరోగా సాయి ధరమ్ తేజ్‌కు ఇది 15వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
మరోవైపు ‘వినోదయ సీతమ్’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీలీల ఓ ఐటెమ్ సాంగ్‌లో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన నటుడు సముద్ర ఖని.. తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్‌తో పాటు ‘దేవుడే దిగి వచ్చిన..’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో, అవన్నీ పుష్కలంగా ఉండేలాగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో శ్రద్ద తీసుకున్నారట. పవన్ ఇదివరకే ‘గోపాల గోపా’ల సినిమాలో దేవుడిగా కనిపించారు. ఇప్పుడు కూడా దేవుడి పాత్రలో అలరించనున్నారట.