Varun Tej and Lavanya Tripathi marriage pics : కొణిదెల వారి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయమైన లావణ్యా త్రిపాఠి నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. ఆ వేడుక కోసం మెగా ఫ్యామిలీ హీరోలు ఇటలీ బయలుదేరి వెళుతున్నారు. 


భార్యతో కలిసి ఇటలీ వెళ్లిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శనివారం ఉదయం భార్య (Pawan Wife) అన్నా లెజినోవాతో కలిసి ఇటలీ వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పవన్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాబోయే వధూవరుల కంటే ముందు రామ్ చరణ్, ఉపాసన ఇటలీ వెళ్లారు. 


Also Read నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు






ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ కూడా శనివారం ఇటలీ వెళ్లారు. సుమారు వారం రోజుల పాటు వీళ్ళందరూ పెళ్లిలో సందడి చేయనున్నారు. వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠితో పాటు మెగా డాటర్ నిహారిక కొణిదెల, మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ శుక్రవారం ఉదయం ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. 


Also Read : లింగోచ్చా రివ్యూ : హైదరాబాద్ నేపథ్యంలో హిందూ ముస్లిం ప్రేమకథ - కార్తీక్ రత్నం సినిమా ఎలా ఉందంటే?






పెళ్లికి ముందు కాక్‌ టైల్ పార్టీ! 
Varun Tej Lavanya Tripathi Wedding Date : నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి అయితే ఈ నెల 30న కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిసింది. ఆ మర్నాడు... అంటే అక్టోబర్ 31న హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. 


మెగా ప్రిన్స్ & సొట్ట బుగ్గల సుందరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. కొణిదెల, త్రిపాఠి, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇటలీ వెళతారు. వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్, నిహారిక & లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం. 


నవంబర్ 5న భాగ్య నగరంలో రిసెప్షన్!
పెళ్ళైన నాలుగు రోజులకు కొత్త జంట హైదరాబాద్ వస్తారు. వివాహానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడంతో సిటీలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలు కూడా పంపారు. కార్ పాస్ కూడా ఇవ్వడం విశేషం. 



ప్రస్తుతం వరుణ్ తేజ్ చేతిలో ఉన్న చిత్రాలకు వస్తే... 'ఆపరేషన్ వేలంటైన్' డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' చేయనున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ కోసం లావణ్యా త్రిపాఠి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial