Pawan Kalyan and CM Chandrababu Naidu To Ateend Kalki 2898 AD: 'కల్కీ 2898 ఏడీ'.. ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈసినిమా కోసం అంద‌రూ ఎదురుచూస్తున్నారు. సినిమాని 70 ఎంఎం స్క్రీన్ మీద చూసేందుకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27 ఇంకెన్ని రోజులు ఉందా అంటూ రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. అంత క్రేజ్ ఉంది ఈ సినిమాకి. ప్ర‌భాస్ సినిమాల‌న్నింటిలో ఈ సినిమా చాలా స్పెష‌ల్ అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై స‌స్పెన్స్ నెల‌కొంది. ఎక్క‌డ జ‌రుగుతుందా? అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. 


చీఫ్ గెస్ట్ లుగా సీఎం, డిప్యూటీ సీఎం.. 


'క‌ల్కీ 2892 ఏడీ'కి అశ్వినీ ద‌త్ ప్రొడ్యూస‌ర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అశ్వినీ ద‌త్ అమ‌రావ‌తిలో నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి రావ‌డం, అమ‌రావ‌తి రాజ‌ధాని అని ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డే ఈవెంట్ గ్రాండ్ గా నిర్వ‌హించాల‌ని భావించార‌ట‌. ఇక ఈ ఈవెంట్ కి సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ని చీఫ్ గెస్ట్ లుగా పిలిస్తే సినిమాకి ఇంకా హైప్ పెరుగుతుంద‌ని అనుకున్నార‌ట సినిమా టీమ్. ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న క్రేజ్, చంద్ర‌బాబుకి ఉన్న రాజ‌కీయా ప‌లుకుబ‌డి క‌లిసొస్తుంద‌ని భావించి వాళ్ల‌ను చీఫ్ గెస్ట్ లుగా పిలుస్తార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా వినిపిస్తోంది. 


అక్క‌డైతే నేను రాను..


ఇదిలా ఉంటే ప్ర‌భాస్ మాత్రం ఈవెంట్ ని అమ‌రావ‌తిలో నిర్వ‌హించేందుకు స‌సేమిరా అన్నార‌ని వార్తలు వస్తున్నాయి. అమ‌రావ‌తిలో నిర్వ‌హిస్తే సినిమాకి, త‌న‌కి ఇద్ద‌రికీ పొలిటిక‌ల్ రంగు అంటుకుంటుంద‌ని, ఫ్యాన్స్ మ‌ధ్య కూడా గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం చాలా ఉంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని స‌న్నిహితులు చెప్పారు. త‌న మాట‌ను కాద‌ని అమ‌రావ‌తిలో నిర్వ‌హిస్తే తాను ఈవెంట్ కి రాన‌ని ప్ర‌భాస్ తేల్చి చెప్పిన‌ట్లు సినీ ఇండ‌స్ట్రీలో టాక్. ఈవెంట్ ని హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌భాస్ ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈవెంట్ ఎక్క‌డ అనేది క్లారిటీ రాలేదు. ఒక‌వేళ హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తే చంద్ర‌బాబు, ప‌వ‌న్ కల్యాణ్ ఈవెంట్ కి వ‌స్తారా?  లేదా? అనేదానిపై కూడా క్లారిటీ లేదు. 


'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సైన్స్ ఫిక్ష‌న్ గా తెర‌కెక్కిన ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీశారు. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల‌హాస‌న్, దీపికా ప‌దుకునే, దిశా ప‌టాని త‌దిత‌రులు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైల‌ర్ ఒక రేంజ్ లో ఉంది. ట్రైల‌ర్ చూసిన వాళ్లంతా బొమ్మ బ్లాక్ బాస్ట‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ మ‌ధ్యే రిలీజైన భైరవ యాంథ‌మ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. బుజ్జి, భైర‌వల‌ను థియేట‌ర్ లో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక జూన్ 27న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.  


Also Read: రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో 'నిమ్మకూరు మాస్టారు'... హీరోగా సంగీత దర్శకుడి వారసుడు!