Latest Update On Renuka Swamy Case and Darshan Arrest: దర్శన్... కన్నడలో స్టార్ హీరో. రీల్ లైఫ్‌లో ఆయన ఎన్నో ఫైట్లు చేశారు. ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిన హీరో క్యారెక్టర్లు చేశారు. కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం ఓ అభిమాని పాలిట విలన్ అయ్యారు. ఓ మహిళ కోసం సామాన్య వ్యక్తి ప్రాణాలు తీసిన కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 


రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యావత్ భారతీయుల దృష్టి ఈ కేసు మీద ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అసలు ఈ కేసు అంతటికీ మూలం పవిత్రా గౌడ అని పోలీసులతో పాటు కన్నడ ప్రజానీకం చెబుతోంది. కట్టుకున్న భార్యకు దూరంగా ఉంటున్న దర్శన్... పవిత్రా గౌడతో సంబంధం నడుపుతున్నారనేది కర్ణాటకలో వినిపించే మాట. 


తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పవిత్ర గౌడ... తామిద్దరి బంధానికి పదేళ్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. భార్యకు దూరంగా ఉన్న తన అభిమాన హీరో మరొక మహిళతో చనువుగా ఉండటాన్ని రేణుకా స్వామి తట్టుకోలేకపోయాడు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అతడిని పిలిపించిన దర్శన్... చిత్ర హింసలకు గురి చేయడంతో మరణించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ కేసులో ఏ1 ముద్దాయిగా పవిత్రా గౌడను, ఏ2గా దర్శన్ సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?


ఆస్పత్రి పాలైన పవిత్రా గౌడ... ఆమెకు ఏమైంది?
కర్ణాటక నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం... పవిత్రా గౌడ ఆస్పత్రి పాలయ్యారు. కొన్ని రోజులుగా కామాక్షీపాళ్య పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం మల్లత్తహళ్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారట. దాంతో ఆమెకు ఏమైంది? ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది? అనేది ఆసక్తికరంగా మారింది.


Also Readతెలుగు రాష్ట్రాల్లో 'దేవర' ప్రీ రిలీజ్ బిజినెస్... లాభాలు రావాలంటే ఎన్టీఆర్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని గట్టిగా కొట్టాలి



చిత్ర దుర్గ నుంచి బెంగళూరు తీసుకొచ్చి...
పవిత్రా గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే... అతడిని చిత్ర దుర్గ నుంచి బెంగళూరుకు దర్శన్ దగ్గర వ్యక్తులు తీసుకు వచ్చారని పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడి అయినట్లు సమాచారం అందుతోంది. బెంగళూరులోని ఒక షెడ్డులో చిత్ర హింసలకు గురి చేయడంతో రేణుకా స్వామి మరణించారని, ఆ తర్వాత అతడి మృత దేహాన్ని అక్కడి నుంచి మరొక చోటుకు తరలించి నీటిలో పారేశారట. మృత దేహాన్ని తీసుకు వెళ్లిన కారును దర్శన్ కారు ఫాలో అయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Also Readహనీ రోజ్ కత్తి పట్టి మనుషుల్ని వేటాడితే... గ్లామర్ కాదు, Rachel Teaserలో హనీ మాస్