Parineeti Chopra: బాలీవుడ్‌లో ఆఫ్ స్క్రీన్ ఒకరిని ఒకరు ఏడిపించుకుంటూ క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్‌లో రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా కూడా ఒకరు. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ ఇప్పటిది కాదు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘లేడీస్ వర్సెస్ రిక్కీ బాహ్ల్’ అనే సినిమాతోనే పరిణీతి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ హీరోహీరోయిన్‌గా కూడా కలిసి నటించారు. అలా ఇన్నేళ్లుగా వీరిద్దరి బాండింగ్ చాలా బలపడింది. రణవీర్ సింగ్ ఎంత సరదాగా ఉంటాడో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే బయటపెట్టగా.. తన అల్లరి గురించి పరిణీతి చెప్పిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.


రెండు రోజులకు ఒకసారి..


‘‘నేను రణవీర్‌ చేసే పనులకు అలవాటు పడిపోయాను. వార్తల్లో వచ్చే విషయాలు మాత్రమే మీకు తెలుసు. కానీ అక్కడ ఏం జరిగిందో లైవ్‌గా చూసేది మేము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లుక్‌లో వచ్చి ఈరోజు ఇదే లుక్‌ అంటాడు. రణవీర్‌తో మనం ఎలాగైనా ఉండొచ్చు. తను ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కన కూర్చుంటాడు. అబ్బా.. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని చెప్పాల్సి వస్తుంది. రెండు రోజులకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది’’ అంటూ రణవీర్ సింగ్ గురించి ప్రేక్షకులకు తెలియని కొత్త విషయాన్ని బయటపెట్టింది పరిణీతి చోప్రా. రణవీర్ గురించి ఈ విషయం విన్న తన ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.


మేకప్ వ్యాన్‌లోకి వెళ్లను..


‘‘నేను మామూలుగా ఎవరి మేకప్ వ్యాన్‌లోకి అయినా వెళ్లిపోతూ ఉంటాను. కానీ రణవీర్ సింగ్ మేకప్ వ్యాన్‌లోకి మాత్రం తన పర్మిషన్ లేకుండా అస్సలు వెళ్లను. పర్మిషన్ ఎందుకంటే తను నిద్రపోతూ ఉంటాడో లేదా వాష్‌రూమ్‌లో ఉంటాడో అని కాదు.. బట్టలు వేసుకున్నాడో లేదా అని. ఒక్కొక్కసారి లోపలికి రావచ్చా అంటే రావచ్చు అంటాడు. కానీ బట్టలు లేకుండా నిలబడి ఉంటాడు. అందుకే తన మేకప్ వ్యాన్‌లోకి వెళ్లే ముందే అడగాలి’’ అని ఫన్నీ విషయం బయటపెట్టింది పరిణీతి. పరిణీతి చోప్రా హీరోయిన్ అవ్వకముందు రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘బ్యాండ్ బాజా బరాత్’ డైరెక్షన్ టీమ్‌లో పనిచేసింది. అప్పటినుండి ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది.


రూమ్‌లోకి వెళ్లిన ప్రతీసారి..


‘‘తనను బట్టలు లేకుండా చూస్తే తనేం ఫీల్ అవ్వడు. కానీ మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. బ్యాండ్ బాజా బరాత్ నుండి ఇదే జరుగుతోంది. నేను తన రూమ్‌లోకి వెళ్లిన ప్రతీసారి బట్టలు లేకుండానే కనిపించేవాడు. తను పబ్లిక్‌లోనే ప్యాంట్ తీసేయగలడు. ఇదంతా తనకు పెద్ద విషయం కాదు. నేను ఒక ఎమోషనల్ రొమాంటిక్ సీన్ కోసం రెడీ అవుతూ ఉంటాను. సడెన్‌గా వెనక్కి తిరిగి చూస్తే తను ప్యాంట్ లేకుండా కనిపించేవాడు. నేను నా స్క్రిప్ట్ జోన్‌లో ఉన్నాను. కాస్త సాయం చేయొచ్చు కదా అంటే అప్పుడు వెళ్లి ప్యాంట్ వేసుకొని వస్తాడు. రణవీర్‌కు అసలు సిగ్గులేదు’’ అంటూ రణవీర్‌తో తనకు ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి, రణవీర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది పరిణీతి చోప్రా.


Also Read: తను మంచి నటి - ‘హీరామండి’లో షర్మిన్‌పై వస్తున్న ట్రోల్స్‌పై యాక్టర్ కామెంట్స్