Crew Starts Streaming On OTT: 2024 బాలీవుడ్‌కు బాగా కలిసొస్తోంది. ఇప్పటివరకు విడుదలయిన చాలావరకు హిందీ చిత్రాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా.. డిఫరెంట్ కథా చిత్రాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. అదే విధంగా ఈ ఏడాది విడుదలయిన ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ మల్టీ స్టారర్ కూడా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయింది. అదే ‘క్రూ’. ఈ మూవీ దాదాపు నెలరోజులకు పైగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


రెండు నెలల తర్వాత..


బాలీవుడ్‌లో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు అనగానే ముందుగా యాక్షన్ జోనర్ గుర్తొస్తుంది. కానీ ‘క్రూ’ అలా కాదు. ఇదొక క్రైమ్ కామెడీ. కరీనా కపూర్, కృతి సనన్, టబు.. ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. ఒక క్రైమ్‌కు పాల్పడాలి అనుకునే ఈ ముగ్గురు చేసే కామెడీ.. సినిమాను బ్లాక్‌బస్టర్ చేశాయి. మార్చి 29న ‘క్రూ’ థియేటర్లలో విడుదలయ్యింది. అయినా ఇప్పటికీ పలు థియేటర్లలో ఇంకా ఈ సినిమా కొనసాగుతూనే ఉంది. ఈ రేంజ్‌లో సక్సెస్ సాధించింది కాబట్టి ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి ఆలస్యం చేశారు మేకర్స్. ఫైనల్‌గా దాదాపు రెండు నెలల తర్వాత ‘క్రూ’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


ఓటీటీలో కూడా సక్సెస్..


ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘క్రూ’ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీని చూసిన కొందరు.. క్రైమ్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందంటూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఎప్పుడూ రఫ్ రోల్స్‌లో కనిపించే కరీనా కపూర్, టబులాంటి హీరోయిన్లు సైతం ఈ మూవీ కోసం తమలోని కామెడీ యాంగిల్‌ను బయటపెట్టారు. ముగ్గురు హీరోయిన్లతో ఒక క్రైమ్ కామెడీని పర్ఫెక్ట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు రాజేశ్ ఏ కృష్ణన్. ఈ సినిమా ఎక్కువగా కామెడీ జోనర్‌లోనే సాగినా.. అక్కడక్కడా ఎమోషన్స్ కూడా వర్కవుట్ అయ్యాయని ప్రేక్షకులు చెప్తున్నారు. మొత్తానికి ఈ మూవీ థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.






సమానంగా ప్రాధాన్యత..


మామూలుగా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు లేదా ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పుడు ఒకరి పాత్రకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని ప్రేక్షకులకు అనిపించడం సహజమే. కానీ ‘క్రూ’ విషయంలో మాత్రం అలా జరగలేదు. టబు, కరీనా కపూర్, కృతి సనన్.. ఇలా ముగ్గురి పాత్రలకు సమానంగా ప్రాధాన్యతను అందించాడు దర్శకుడు రాజేశ్ ఏ కృష్ణన్. అందుకే రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా రూ.156.36 కోట్ల వసూళ్లను సాధించింది. రొటీన్ కమర్షియల్ సినిమాల వల్ల బోర్ అయిపోయిన బాలీవుడ్ ప్రేక్షకులను నవ్వించి హిట్ కొట్టింది ‘క్రూ’.


Also Read: స్పెషల్ ఫ్యాన్స్‌ను కలిసిన షారుఖ్ ఖాన్ - సోషల్ మీడియాలో వీడియో వైరల్