యువ నటుడు తిరువీర్ (Thiruveer) నటించిన సినిమాలు తక్కువే. కానీ, ఆయనకు అంటూ అభిమానులు ఉన్నారు. తన నటనతో ప్రేక్షకులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆయన ఆకర్షించారు. 'మసూద'తో ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'పరేషాన్' (Pareshan Movie). జూన్ 2న థియేటర్లలో విడుదల అయ్యింది. 


'పరేషాన్' ఓటీటీ డీల్ క్లోజ్ - ఎందులో అంటే?
Pareshan OTT Platform : థియేటర్లలో విడుదలకు ముందు 'పరేషాన్' ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. సోనీ లివ్ (Sonylive OTT) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ రోజు విడుదలైంది కాబట్టి అప్పుడే ఓటీటీలో రిలీజ్ డేట్ గురించి చెప్పడం తొందరపాటు అవుతుంది.


'పరేషాన్' చిత్రానికి రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన రెండో చిత్రమిది. దీని కంటే ముందు సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా 'కొబ్బరి మట్ట' సినిమా తెరకెక్కించారు. అది కామెడీ సినిమా. 'పరేషాన్' సైతం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ సినిమా. ఇందులో తిరువీర్ జోడీగా పావని కరణం నటించారు. ఇంతకు ముందు 'హిట్ 2' సినిమాతో పాటు ఆహా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'ద బేకర్ అండ్ ద బ్యూటీ', 'ది సిన్'లో నటించారు. వాల్తేరు ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్ పతాకంపై రానా దగ్గుబాటి సమర్పణలో సినిమా విడుదలైంది.


Also Read : పెద కాపు - శ్రీకాంత్ అడ్డాల - సీఎం సీనియర్ ఎన్టీఆర్



'పరేషాన్' కథ ఏమిటి? ఎలా ఉంది?
ఐజాక్ (తిరువీర్) తండ్రి సమర్పణ్ (మురళీధర్ గౌడ్) సింగరేణి ఉద్యోగి. తండ్రి కష్టపడుతుంటే కుమారుడు ఏమో దోస్తులతో తిరుగుతూ చదువు మీద దృష్టి పెట్టడు. ఐటిఐ ఫెయిల్ అవుతాడు. తన ఉద్యోగం కుమారుడికి రావాలంటే డబ్బులు కట్టాలని (లంచం ఇవ్వాలని) పెళ్ళాం చేతి బంగారు గాజులు అమ్మి మరీ కొడుకు చేతిలో పెడతాడు సమర్పణ్. కొడుకు ఏమో దోస్తులకు అవసరం వచ్చిందని ఆ డబ్బంతా వాళ్ళకు సమర్పిస్తాడు. దోస్తులతో జల్సాలు, షికార్లకు తోడు శిరీష (పావని కరణం)తో ప్రేమ శారీరక సంబంధం వరకు పోతది. ఆమెకు ఓ రోజు వాంతులు కావడంతో కడుపు వచ్చిందని నానా గాబర పడతది. పట్నం పోయి పరీక్షలు చేయించనీకి ఐజాక్ దగ్గర పైసల్లేవ్. దోస్తులను అడిగితే ఇయ్యరు. ఆ తర్వాత ఏమైంది? ఐజాక్ & దోస్తులకు, పక్కపంటి ఊరు పిల్లగాళ్లకు గొడవ ఏంది? పైసలు దోస్తులకు ఇచ్చిండని, ఓ పిల్లతో ప్రేమలో ఉన్నాడని తెలిసిన సమర్పణ్ కొడుకును ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది కథ. 


'పరేషాన్' సినిమాలో కామెడీకి మంచి పేరు వచ్చింది. ప్రీమియర్ షోలు చూసిన విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు ఆ మాటే చెబుతున్నారు. వినోదానికి తోడు యశ్వంత్ నాగ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. తెలంగాణ నేపథ్యంలో కామెడీ కనుక నైజాంలో ప్రేక్షకులు ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. 


Also Read : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!