Pankaj Tripathi about RGV: బాలీవుడ్‌లోని వర్సటైల్ యాక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు పంకజ్ త్రిపాఠి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ చిత్రం పంకజ్ కెరీర్‌నే మలుపుతిప్పింది. అందులో సుల్తాన్ ఖురేషీ అనే పాత్రలో నటించి.. అందరినీ అలరించారు. సుల్తాన్ ఖురేషీ అనేవాడు ఒక గ్యాంగ్‌స్టర్. అయితే ఆ ఫిక్షనల్ పాత్రనే చాలామంది రియల్ లైఫ్ గ్యాంగస్టర్లు ఐడల్‌గా భావించేవారని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పంకజ్. అంతే కాకుండా మరెన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. మొదటిసారి రామ్ గోపాల్ వర్మ సినిమాలో పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లినప్పుడు తనకు ఎదురైన వింత అనుభవాన్ని కూడా తెలిపారు.


రామ్ గోపాల్ వర్మతో మొదటి మీటింగ్..
ముందుగా రామ్ గోపాల్ వర్మను మొదటిసారి ఆడిషన్ కోసం కలిసి సంఘటనను గుర్తుచేసుకున్నారు పంకజ్ త్రిపాఠి. ‘‘రాము నన్నే చూస్తూ నా ముందు కూర్చున్నారు. ఒక మనిషి 10, 15 నిమిషాలు మనల్నే చూస్తూ ఉంటే.. మనకు ఇబ్బందిగా ఉండి ఎటువైపు చూడాలో అర్థం కాదు. ఆ తర్వాత నన్ను వెళ్లిపోమని, మళ్లీ పిలవలేదు’’ అని బయటపెట్టారు పంకజ్. అంతే కాకుండా తను మరోసారి ఆర్జీవీ ఆఫీస్‌కు వెళ్లినప్పుడు చాలామంది అక్కడ మొహం మీద గాయాలతో కనిపించారని చెప్పారు. ఎందుకలా అని అడగగా.. రామ్ గోపాల్ వర్మ కేవలం భయంకరంగా ఉన్న మనుషులను మాత్రం క్యాస్ట్ చేసుకుంటారని అనేవారని చెప్పేవారని తెలిపారు. ‘‘ఆరోజుల్లో రాము తమను క్యాస్ట్ చేసుకుంటాడేమో అనే ఆశతో నాలుగు బంగ్లాల్లో చాలామంది నటులు మొహంపై గాయాలతో, రక్తపు మరకలతో తిరిగేవారు’’ అని బయటపెట్టారు పంకజ్.


నార్త్‌తో మాత్రమే కాదు.. సౌత్‌లో కూడా..
ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సినిమా తన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో కూడా గుర్తుచేసుకున్నారు పంకజ్. ‘‘చాలామంది గ్యాంగ్‌స్టర్స్ నన్ను కలిశారు. ఆ రోజుల్లో నార్త్, సౌత్‌కు చెందిన చాలామంది గ్యాంగ్‌స్టర్స్ నన్ను వారి ఐడల్‌గా భావించేవారు. చాలామంది సుల్తాన్ సినిమాలో ఎలా ఉన్నాడో, ఏం చేసేవాడో బయట కూడా అదే చేస్తాడని అనుకునేవారు. సుల్తాన్ క్యారెక్టర్ మంచిది అవ్వడంతో చాలామంది ఆ పాత్రను ఇష్టపడేవారు’’ అంటూ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’లో తాను చేసిన సుల్తాన్ ఖురేషీ అనే పాత్ర తనకు ఎంత అభిమానాన్ని తెచ్చిపెట్టిందో తెలిపారు పంకజ్.


కత్తి తీస్తానేమో అని భయపడేవారు..
‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ తర్వాత చాలామంది రైటర్స్, డైరెక్టర్స్.. తన దగ్గరకు కథలు వినిపించడానికి వచ్చేవారని, కానీ వారందరూ తనను చూసి నిజమైన గ్యాంగ్‌స్టర్‌ను చూసినట్టు భయపడేవారని అన్నారు. ‘‘ఆ తర్వాత నాకు కథలు వినిపించడానికి చాలామంది రైటర్స్ వచ్చారు. వారంతా నేను జేబులో నుంచి కత్తి తీస్తానేమో అన్నట్టుగా భయపడేవారు’’ అని నవ్వుతూ చెప్పారు పంకజ్. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో అప్పటినుంచి ఇప్పటివరకు పంకజ్.. ఎన్నో గ్యాంగ్‌స్టర్ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్ కాకుండా మరో పాత్రలో తనను ఊహించుకోలేని విధంగా ప్రేక్షకులకు అలవాటు అయిపోయారు. ప్రస్తుతం అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మే అటల్ హూ’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు పంకజ్. ఈ సినిమా కోసం ఆయన మేక్ ఓవర్ చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.


Also Read: ప్రభాస్ 'కల్కి' విడుదలకు మెగా సెంటిమెంట్ - చిరు క్లాసిక్ ఫిల్మ్ రిలీజ్ రోజే