ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అందరూ ఎదురు చూసే వేడుకల్లో ఆస్కార్స్ ఒకటి. ప్రతి ఏడాది అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో అంగరంగ వైభంగా ఈ వేడుక జరుగుతుంది. ఈ ఏడాది (2025) కూడా అంతే! అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్స్) విజేతల వివరాల్ని వెల్లడించింది. మరి, ఎవరెవరు ఆస్కార్ అందుకున్నారో చూడండి.
బెస్ట్ యాక్టర్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్‌లో 'ది బ్రూటలిస్ట్' సినిమా అవార్డులు అందుకుంది. అయితే... 'అనోరా' ఉత్తమ సినిమాగా నిలిచింది. ఆ సినిమాకు గాను ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాల్లో షాన్ బేకర్ అవార్డులు అందుకున్నారు. సినిమాతో పాటు ఆయనకు నాలుగు వచ్చాయి. అందులోని హీరోయిన్ మైకీ మెయిడ్ సన్ బెస్ట్ లీడింగ్ లేడీగా నిలిచింది. మొత్తం మీద ఈ సినిమా ఆస్కార్స్ తన ఖాతాలో వేసుకుంది. సహాయ నటి, సాంగ్... 'ఎమిలీయా పెరీజ్'కు రెండు అవార్డులు వచ్చాయి. సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్... రెండు విభాగాల్లో 'డ్యూన్ పార్ట్ 2' అవార్డులు అందుకుంది.
వీళ్ళే ఆస్కార్స్ 2025 విజేతలు!
- ఉత్తమ చిత్రం: అనోరా (దర్శకుడు - షాన్ బేకర్, నిర్మాతలు - అలెక్స్ కోకో, సమంత క్వన్, షాన్ బేకర్)
- ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ - Adrien Brody (ది బ్రూటలిస్ట్)
- ఉత్తమ నటి: మైకీ మెయిడ్ సన్ (అనోరా సినిమా)
- ఉత్తమ దర్శకుడు: షాన్ బేకర్ (అనోరా సినిమా)
- ఉత్తమ సహాయ నటుడు: Kieran Culkin (ఏ రియల్ పెయిన్ సినిమా)
- ఉత్తమ సహాయ నటి: జోయ్ సల్దానా (ఎమిలీయా పెరీజ్ సినిమా)
- ఉత్తమ ఛాయాగ్రహణం: లోల్ క్రావ్లీ (ది బ్రూటలిస్ట్ సినిమా)
- బెస్ట్ సౌండ్: 'డ్యూన్ పార్ట్ 2'కు గాను రిచర్డ్ కింగ్, డగ్ హెమ్‌ఫిల్, రాన్ బార్ట్‌లెట్, గరేత్ జాన్
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్: 'ది బ్రూటలిస్ట్' సినిమాకు గాను డేనియల్ బ్లమ్ బర్గ్
- ఉత్తమ పాట (ఒరిజినల్ సాంగ్): 'ఎమిలీయా పెరీజ్' సినిమాలోని 'ఎల్ మాల్'
Also Read: ఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు
- బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: అయామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్ సినిమా - వాల్టర్ సాలస్ దర్శకత్వం వహించారు)
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: 'ఫ్లో' (Flow)
- బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రెస్ (In The Shadow Of The Cypress)
- బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నో అదర్ ల్యాండ్
- బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: అయామ్ నాట్ రోబోట్
- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద ఓన్లీ గాళ్ ఇన్ ద ఆర్కెస్ట్రా
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: 'డ్యూన్ పార్ట్ 2'కు గాను పాల్ లాంబెర్ట్, స్టీఫెన్ జేమ్స్, గ్రెడ్, రైస్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: షాన్ బేకర్ (అనోరా)
- బెస్ట్ కాస్టూమ్ డిజైనర్: 'వికెడ్' సినిమాకు గాను పాల్ తాజ్‌వెల్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: 'వికెడ్'కు గాను నాథన్ క్రావ్లీ, లీ సాండలీస్
- బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: 'ది సబ్‌స్టెన్స్' సినిమాకు గాను Pierre-Olivier Persin, Stéphanie Guillon and Marilyne Scarselli
- బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: పీటర్ స్ట్రాన్ (కాంక్లేవ్ సినిమా)
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: షాన్ బేకర్ (అనోరా సినిమా)
Also Read: 24 క్యారెట్ల బంగారం, చేతిలో కత్తి... ఈ ఆస్కార్ విగ్రహం ఎవరు చేశారో తెలుసా?