Oscar Awards 2024 Highlights: 96వ ఆస్కార్స్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సిటీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నటీనటులు సైతం పాల్గొన్నారు. ఆస్కార్స్ ప్రకటనకు ముందు జరిగిన రెడ్ కార్పెట్ షోలో అనుకోని ఘటన జరిగింది. అమెరికాకు చెందిన నటి, మోడల్ లీజా కోషి ఒక్కసారిగా కింద పడిపోయారు. రోజ్ గౌన్‌తో.. స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్న లీజా కోషి రెడ్ కార్పెట్ షోలో భాగంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు లిజా కోషీ.
ఫోటో సెషన్ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆమె వేసుకున్న టవరింగ్ హైహీల్స్ గౌన్‌కు అడ్డుతగిలాయి. దీంతో ఆమె అకస్మాత్తుగా కిందపడిపోయింది. వెంటనే పక్కనున్న నిర్వాహకులు ఆమెను పైకి లేపారు. ఈ లోపే ఫొటోలు క్లిక్‌మనించారు మీడియా ప్రతినిధులు. లిజా కోషీ జారి పడిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టవరింగ్ హై హీల్స్ తో వచ్చిన ఇబ్బంది ఇదేనంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. అయ్యయో, అందరి ముందు పరువుపోయిందంటూ మరికొందరు కామెడీ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని నిర్వాహెకులు తెలిపారు.
మరిన్ని ‘ఆస్కార్’ విశేషాలు:
⦿ ఈ వేడుకల్లో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' ఈ ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటింది. మెజారిటీ విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులను ఈ మూవీ సొంతం చేసుకుంది. క్రిస్టోఫర్ నోలన్ తన మూవీ కెరీర్‌లో మొదటిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు.
⦿ ప్రముఖ నటుడు, WWW రెజ్లర్ జాన్ సీనా ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆస్కార్ వేదికపైకి వచ్చి ఆశ్చర్యపరిచాడు. నగ్నంగా రావడమే కాకుండా ‘బెస్ట్ కాస్ట్యూమ్స్’ అవార్డు ప్రకటించారు. అయితే 1974లో జరిగిన ఓ ఘటనను గుర్తుచేస్తూ.. జాన్ సీనా ఇలా చేశారని నిర్వాహకులు ‘కవర్’ చేశారు. అప్పట్లో ఓ వ్యక్తి నగ్నంగా స్టేజ్ మీదకు వచ్చాడని, అప్పట్లో అది సంచలనంగా మారిందని, ఆ ఘటన చోటుచేసుకుని 50 ఏళ్లు కావడంతో.. ఈ వేడుకల్లో గుర్తుచేసినట్లు పేర్కొన్నారు.
⦿ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘RRR’ మూవీని ‘ఆస్కార్’ మరిచిపోలేకపోతోంది. ఆస్కార్స్ 2024 వేడుకల్లో కూడా ఈ మూవీకి ప్రత్యేక స్థానమిచ్చారు. మరోసారి భారతీయులను గర్వపడేలా చేశారు. వేదికపై రెండుసార్లు స్టేజి మీద ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ ప్రదర్శించారు.
⦿ సినిమా కోసం జీవితాలను పణంగా పెట్టేది స్టంట్ కమ్యూనిటీ అంటూ ప్రపంచంలో ది బెస్ట్, గ్రేటెస్ట్ స్టంట్స్‌ను ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. అందులో ‘RRR’ మూవీ క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌ను భుజాలపైకి ఎక్కించుకుని ఎన్టీఆర్ చేసిన స్టంట్‌ను ప్రదర్శించారు. చివర్లో కూడా మరో సీన్‌ను చూపించారు. వేదికపై ఉన్న స్క్రీన్‌లో ‘RRR’లోని ‘‘నాటు నాటు...’’ సాంగ్ విజువల్స్ కూడా ప్లే చేయడం గమనార్హం.
Also Read: క్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే