ఆస్కార్స్ వేడుక (Oscars 2023)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ కనువిందు చేశారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) భుజం మీద పులి బొమ్మ ఉన్న డ్రస్ వేసుకుని సందడి చేశారు. మన దేశ జాతీయ జంతువు పులి. పైగా, 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ గుర్తు ఉందిగా? వ్యాన్ లోనుంచి పార్టీ గ్రౌండులోకి ఎన్టీఆర్, కొన్ని వన్య ప్రాణులు దూకుతాయి. అందులోనూ పులి ఉంది. ఆ దూకిన పులికి గుర్తుగా, దేశాన్ని ప్రతిబింబించేలా డ్రస్ వేసుకున్నారని ఎన్టీఆర్ చెప్పారు. రెడ్ కార్పెట్ మీద ఇండియా నడుస్తున్నట్లు ఫీల్ అవ్వాలని అలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నట్లు తారక్ చెప్పాడు. మరి రామ్ చరణ్ సంగతి ఏంటి?


రామ్ చరణ్ డ్రస్ వెనుక పెద్ద కథే ఉంది!
ఆస్కార్స్ రోజున, ముఖ్యంగా రెడ్ కార్పెట్ మీద రామ్ చరణ్ డ్రస్ (Ram Charan Oscar Dress) గురించి పెద్ద చర్చ జరగలేదు. కొంత మందికి ఆ డ్రస్ డిజైనర్ వేర్ తరహాలో అనిపించి ఉండవచ్చు. అది డిజనర్ వేర్ అనడంలో సందేహం లేదు. కానీ, ఆ డిజైన్ వెనుక పెద్ద కథ ఉంది. దేశభక్తి కూడా దాగి ఉంది. 


రామ్ చరణ్ డ్రెస్ గురించి ప్రముఖ హాలీవుడ్ మీడియా వ్యానిటీ ఫెయిర్ ఓ ప్రత్యేక వీడియో షూట్ చేసింది. రామ్ చరణ్, ఉపాసన స్టే చేసిన ఇంటికి వెళ్లి మరీ వాళ్ల కాస్ట్యూమ్స్ వివరాలు అడిగి తెలుసుకుంది. రామ్ చరణ్ వేసుకున్నది బంద్ గలా జెండర్ ఫ్లూయిడ్ కుర్తా. దీన్ని అల్లూరి సీతారామ రాజు స్పూర్తితో రూపొందించారు డిజైనర్స్ శంతను & నిఖిల్. 


Also Read బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్ 


'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. ఒక్కసారి రామ్ చరణ్ డ్రస్ చూస్తే... ఆయన మిలటరీ మెడాలియన్స్ ధరించారు. అవి పంజాబ్ రెజిమెంట్ కు చెందిన మిలటరీ మెడల్స్. ఇంకా ఈ బంద్ గలా ఉన్న బటన్స్ అన్ని చక్రాస్. మన జాతీయ జెండాలో చక్రానికి, మోడ్రన్ ఇండియాకు ఇవి ప్రతీకలు. ఇక, రామ్ చరణ్ చేతికి ఉన్న పెద్ద బటన్ మీద భారత్ అని రాసి ఉంది. భారత దేశాన్ని రిప్రజెంట్ చేసేలా... అల్లూరి దేశభక్తికి చిహ్నంగా రామ్ చరణ్ డ్రస్ రూపొందించారు
అల్లూరికి రామ్ చరణ్ నివాళి అర్పించడమే కాదు... ప్రపంచం అంతా చూసే ఆస్కార్ వేదికపై ఇండియన్ మిలటరీని రామ్ చరణ్ రిప్రజెంట్ చేశారు.


ఉపాసన డ్రస్ చూశారా?
భారతీయ సంస్కృతిలో భాగమైన చీరకట్టులో ఆస్కార్ వేడుకల్లో ఉపాసన మెరిశారు. తెలంగాణకు చెందిన జయంతి రెడ్డి రూపొందించిన కస్టమైజ్డ్ సిల్క్ శారీతో పాటు బీనా గోయెంకా డిజైన్ చేసిన లిలియం స్టేట్మెంట్ నెక్ పీస్ ను పెట్టుకున్నారు. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ను ఇవ్వటంతో పాటు ఈ పెయిర్ రెడ్ కార్పెట్ పైన సందడి చేశారన్నమాట. అన్నట్లు విదేశాలకు ఎక్కడికి వెళ్లా తమతో పాటు దేవుడిని కూడా తీసుకెళ్తామంటూ సీతారాముల విగ్రహాలను చూపించి సనాతన ధర్మం, ఆధ్యాత్మికతపై తమకున్న ఆసక్తిని హాలీవుడ్ మీడియాకు పరిచయం చేశారు రామ్ చరణ్ అండ్ ఉపాసన.


Also Read : రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఫారిన్‌లో ప్రభాస్