సాధారణంగా సినిమాల్లో ఫైటింగ్ సీన్స్ అంటే కచ్చితంగా డూప్ లే ఎక్కువగా చేస్తారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం పోరాట సన్నివేశాలంటే డూప్ లేకుండా తామే స్వయంగా చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అటు వంటి వాళ్ళలో తమిళ హీరో విశాల్ ఒకరు. యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతటి రిస్క్ అయిన తీసుకునేందుకు వెనుకాడరు. అలా ఇప్పటికే ఆయన చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరిగిన కూడా మళ్ళీ ఆయనే వాటిని చేస్తాను అంటారు కాని డూప్ లను పెట్టేందుకు ఒప్పుకోరు. నాలుగు నెలల వ్యవధిలోనే విశాల్ మరోసారి షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యారు.


ప్రస్తుతం విశాల్ నటిస్తున్న చిత్రం ‘లాఠీ’. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన సమయంలో ఒకసారి గాయపడ్డారు. తాజాగా చెన్నైలో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నప్పుడు మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలుకి బాగా దెబ్బ తగిలింది. దీంతో షూటింగ్ ని నిలిపివేశారు. గతంతో పోలిస్తే ఈ సారి గాయాలు తీవ్రం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభించనునట్లు చిత్ర బృందం వెల్లడించింది. గతంలో ప్రమాదం జరినప్పుడు ఆయన కేరళ వెళ్ళి దాదాపు మూడు వారాల పాటు చికిత్స తీసుకుని వచ్చారు. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాతో విశాల్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఎ. వినోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రమణ, నంద నిర్మాతలు. విశాల్ కి జోడీగా సునైన నటిస్తుంది.



Also read: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి


Also read: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా