OMG (O Manchi Ghost) Trailer Released: నిజానికి హారర్ సినిమాలు అంటే చాలా భయపడేవారు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. కారణం హారర్ కి కామెడీని జోడిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఆ ట్రెండే నడుస్తోంది. 'కాంచన' సినిమా మొదలుకుని ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల 'గీతాంజలి', 'గీతాంజలి - 2'తో పాటు మరెన్నో సినిమాలు ఈ జోనర్ లో వచ్చాయి. ఇప్పుడు అదే జోనర్ లో 'ఓ. ఎమ్. జి (ఓ మంచి గోస్ట్)' సినిమా కూడా రాబోతోంది. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. వెన్నెల కిశోర్ తో పాటు షకలక శంకర్, నందిత శ్వేత తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.
ఆ అమ్మాయే అందరినీ చంపుతుందట!
"ఆ కోటలో ఒక అమ్మాయిని ఎవరో చంపేశారట. ఆ అమ్మాయే దయ్యం అయ్యి అందరినీ చంపేస్తుందని మాట్లాడుకుంటారు అందరూ" అంటూ.. ఒక కోటలో దయ్యాని చూపిస్తూ ట్రైలర్ మొదలవుతుంది. కట్ చేస్తే.. నలుగురు స్నేహితులు డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తుంటారు. "అందరి ప్రాబ్లమ్స్ వేరే ఉన్నా సొల్యూషన్ ఒకటే అదే డబ్బు. మీరంతా ఓకే అంటే నా దరగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది" అంటూ నలుగురు స్నేహితులు ఎక్కడికో తయారవుతారు. దేవుడి వేషాలు వేసుకుని ఒక పాత కారులో బయలుదేరతారు. అంతా బాగానే ఉంటుంది అప్పుడే ఒక పెద్ద కోట, దానిపై దయ్యం ఉన్నట్లు చూపిస్తారు. నలుగురు స్నేహితులు పిశాచిపురం అనే బోర్డ్ దగ్గర నిలబడతారు. అప్పుడు షకలక శంకర్ "ఇదేఊరో తెలుసా?" పిశాచపురం అని భయంగా అంటాడు. "ఇక్కడ పిశాచులు ఉంటాయి" అంటాడు. కానీ, ఎవ్వరూ వినకుండా ఆ కోటలోకి వెళ్తారు. ఇక అక్కడ నుంచి మొదలవుతుంది అసలు కథ.
వాళ్లను ఆ దేవుడే కాపాడాలి..
ట్రైలర్ ని చూస్తే ఈ సినిమా మొత్తం కోటలోనే జరుగుతున్నట్లు అర్థం అవుతుంది. ఆ కోటలోనే కామెడీ కూడా మొదలవుతుంది. "నేను మెజీషియన్ అబ్రక దబ్ర" అనుకుంటూ వెన్నెల కిశోర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కామెడీ మొదలైంది. అప్పుడే "కోట్లు కావాలి.. 20 కోట్లు కావాలి" అంటూ విలన్ ఎంట్రీ ఇస్తాడు. కొన్ని హారర్ సీన్లు పెట్టారు. దయ్యాలు, షకలక శంకర్, వెన్నెల కిశోర మధ్య కొన్ని ఫన్నీ సీన్లు పెట్టారు.
"ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు. వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం" అంటూ రెండు ఆడదయ్యాలు మెట్లు దిగొస్తున్న సీన్ తో సినిమాలో సీరియస్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు ఉన్నారు. ఇక ఆ తర్వాత దయ్యాలను బంధించేందుకు పూజలు చేయడం లాంటివి చూపించారు. ఇప్పటికి ఈ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈసినిమా కూడా రొటీన్ గా ఉన్నట్లు అనిపిస్తుంది ట్రైలర్ ని చూస్తే. అన్ని సీన్లు వేరే సినిమాల్లో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. సినిమా మొత్తం చేస్తే కానీ ఏదైనా తేడా ఉండేమో అర్థం కాని పరిస్థితి.
ఓ.ఎమ్.జి లో వెన్నల కిశోర్, షకలక శంకర్, నందిత శ్వేత, నవమీ గాయక్, నవీన్ నేని, రాజత్ రాఘవ, రఘుబాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి శంకర్ కే. మార్తాండ్ డైరెక్టర్. మార్కెట్ నెట్ వర్క్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై డాక్టర్ అభినిక ఐనబత్తుని నిర్మించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
Also Read: 'డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది - 'పుష్ప 2' విడుదలపై కన్నేసిన పూరీ, బన్నీ తప్పుకున్నాడా?