హమ్ నే ఆల్రెడీ బోల్ దియా... హమ్ నే కాషన్ కియా... ఈ మాటలు కొన్ని రోజులు ఇంటర్‌నెట్‌ను ఊపేశాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా తీసిన 'అఖండ 2' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటిని తన కొత్త సినిమాకు వాడేశారు మరో దర్శకుడు మహి వి రాఘవ్.   

ఓం శాంతి డిస్కో శాంతి...ఆల్రెడీ కాషన్ కియా క్యాప్షన్!ఆల్రెడీ హమ్ కాషన్ కియా.. ఆల్రెడీ హమ్ నే బోల్ దియా.. ఆల్రెడీ అని బాలయ్యతో బోయపాటి శ్రీను ఇచ్చిన హిందీ ఇంటర్వ్యూ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ట్రోల్స్, మీమ్స్‌లో ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇక అలాంటి ట్రెండీ పదాల్నే క్యాప్షన్స్‌గా పెట్టారు మహి వి రాఘవ్. 'ఓం శాంతి డిస్కో శాంతి' సినిమాకు 'ఆల్ రెడీ కాష‌న్ కియా... ఆల్ రెడీ' అని క్యాప్షన్ పెట్టేశారు. సేవ్ ది టైగర్స్‌తో దుమ్ములేపేస్తున్న మహి వి రాఘవ్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్‌తో రాబోతోన్నారు.

Also Read: Vijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ వంటి ఎంట‌ర్‌టైన‌ర్స్ సృష్టిక‌ర్త మ‌హి వి.రాఘ‌వ్ ఇక స‌రికొత్త కామెడీ హార‌ర్ చిత్రం 'ఓం శాంతి డిస్కో శాంతి'తో అందరినీ భయపెట్టి, నవ్వించబోతోన్నాడు. 'ఆల్ రెడీ కాష‌న్ కియా... ఆల్ రెడీ' అనే క్యాప్షన్‌ను బట్టి చూస్తేనే ఇదెంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని అర్థం అవుతోంది. మరోసారి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌టానికి ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త ట్విస్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దెయ్యాలు మ‌నుషుల్ని భ‌య‌పెట్టాయి. కానీ ఆ దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది.

Also Readవిఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... ఇప్పుడు మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?

అస‌లు భ‌యం అంటే తెలియ‌ని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకు వ‌స్తే... దెయ్యాలు వ‌ర్సెస్ పిచ్చివాళ్లు మ‌ధ్య జ‌రిగే ఓ గంద‌ర‌గోళ‌మైన ఫుల్ ఫ‌న్ రైడర్ 'ఓం శాంతి డిస్కో శాంతి'. దెయ్యాలు పిచ్చివాళ్ల‌ని భ‌య‌పెట్ట‌గ‌ల‌వా?  లేక పిచ్చివాళ్లే తిర‌గ‌బ‌డి దెయ్యాల్ని భ‌య‌పెడ‌తారా?, జంప్ స్కేర్‌, ఫ‌న్నీ డైలాగ్స్‌, ఉహించ‌ని ట్విస్టులతో ఈ స్పూకీ ఫ‌న్ జ‌ర్నీ తెర‌కెక్కుతోంది. 'ఓం శాంతి డిస్కో శాంతి'... ఆల్ రెడీ కాష‌న్ కియా... ఆల్ రెడీ క్యాప్షన్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 

'ఓం శాంతి డిస్కో శాంతి' మూవీకి కృష్ణ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. శివ మేక, సాహితి నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి జ‌్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. మరి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇతర అప్డేట్లు ఎప్పుడు వస్తాయ్ అన్నది చూడాలి.

Also ReadPrakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్