కథానాయకుడిగా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)కు ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ లభించింది. బ్యాక్ టు బ్యాక్... బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సార్లు వంద కోట్లు కొట్టారు. హీరోగా పరిచయమైన 'లవ్ టుడే', ఆ తర్వాత 'డ్రాగన్', మళ్ళీ 'డ్యూడ్'... మూడు సినిమాలూ వందేసి కోట్ల చొప్పున కలెక్ట్ చేశాయి. ఆ తర్వాత ఆయనకు ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది.

Continues below advertisement

నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (లైక్)కి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 50 కోట్లకు అటు ఇటుగా కలెక్ట్ చేసింది. ఈ తరుణంలో ప్రదీప్ రంగనాథన్ మరో రిస్క్ చేస్తారా? మరో సీనియర్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా? అని కోలీవుడ్ ఎదురు చూస్తోంది. ఎందుకు అంటే...

ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం వెంకట్ ప్రభు!తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుకు తెలుగులోనూ కొంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అజిత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'మంకత్తా' (తెలుగులో గ్యాంబ్లర్) పెద్ద హిట్. అదొక్కటే కాదు... 'సరోజ', శింబు హీరోగా తీసిన 'మానాడు' వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే... 'మానాడు' తర్వాత వెంకట్ ప్రభుకు సరైన సక్సెస్ కాలేదు. దళపతి విజయ్ హీరోగా తీసిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' కేవలం తమిళనాడులో విజయ్ అభిమానులను మాత్రమే మెప్పించింది. ఇప్పుడీ సీనియర్ దర్శకుడి ప్రస్తావన ఎందుకంటే... 

Continues below advertisement

Also ReadChiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్

ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం వెంకట్ ప్రభు ట్రై చేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా ఆ మధ్య ఓ సినిమా చేయడానికి ఆయన ప్రయత్నించారు. అయితే... ఆ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. సినిమా హోల్డ్ లో పడింది. అందుకని, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. యంగ్ హీరోకి కథ చెప్పడానికి రెడీ అవుతున్నారు. 

Also ReadPrakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్

కొత్తవాళ్ళతో హిట్లు... మరి సీనియర్ అంటే?ప్రదీప్ రంగనాథన్ మొదటి మూడు సినిమాల దర్శకులు కొత్తవాళ్లు కాదు. 'లవ్ టుడే' డైరెక్టర్ అతనే. 'డ్రాగన్'కు స్టోరీ పాయింట్ ఇచ్చి తన స్నేహితుడి చేతిలో పెట్టారు. 'డ్యూడ్' డైరెక్టర్ కూడా కొత్త. ముగ్గురు కొత్త దర్శకులతో హిట్లు కొట్టిన ప్రదీప్ రంగనాథన్... సీనియర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేసిన 'లైక్'తో మొదటి ఫ్లాప్ అందుకున్నారు. మరి, వెంకట్ ప్రభు కథకు ఆయన ఓకే చెబుతారో? లేదో? వెయిట్ అండ్ సి. ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందో లేదో త్వరలో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే డిస్కషన్ స్టేజిలో ఉందీ ప్రాజెక్ట్. 

Also ReadPeddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్