Oh Bhama Ayyo Rama Glimpse: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది సుహాసే. మిగతా హీరోలంతా ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలియక డైలామాలో ఉంటే, సుహాస్ మాత్రం ట్రెండీ కథలతో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు. తాజాగా ఈ హీరో నుంచి క్రిస్మస్ సర్ప్రైజ్ గా కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. 'ఓ భామ అయ్యో రామ' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సుహాస్ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 


'ఓ భామ అయ్యో రామ' గ్లింప్స్ చూశారా? 
వైవిధ్యమైన సినిమాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్న హీరో సుహాస్. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో త్వరలోనే 'ఓ భామ అయ్యో రామా' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వి ఆర్ట్స్ అండ్ చిత్రలహరి టాకీస్ పతాకంపై ఈ సినిమాను హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్ళూ రెడ్డి నిర్మిస్తున్నారు. రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రథన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుహాస్, మాళవిక మనోజ్ తో పాటు సీనియర్ నటులు అనిత, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ కాదా తాజాగా రిలీజ్ చేశారు. ఇక తాజాగా క్రిస్మస్ కానుకగా రిలీజ్ గ్లింప్స్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. 


'ఓ భామ అయ్యో రామ' గ్లింప్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా సినిమాలో సుహాస్ లుక్ సరికొత్తగా ఉంది. హీరోను తీసుకెళ్లి హీరోయిన్ కారులో కూర్చోబెట్టి "దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే" అంటూ చెప్పిన డైలాగ్ బాగుంది. అయితే ఆమెకు సమాధానంగా సుహాస్ "అందుకే కదా మీరు మా ప్రాణాలు తీసేది" అని వేసిన పంచ్ హిలేరియస్ గా ఉంది. "ఏంటి" అని హీరోయిన్ సీరియస్ గా చూడడంతో, మళ్ళీ మాట మార్చి "అందుకే కదా మీకోసం మేము ప్రాణాలు ఇచ్చేది" అని ఆ డైలాగ్ ని తిప్పి చెప్పడం ఫన్నీ గా ఉంది. మొత్తానికి గ్లిప్స్ తోనే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ చిన్న గ్లిమ్స్ లో విన్పించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. 


Also Readబేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?



హ్యాట్రిక్ హిట్స్ 
సుహాస్ విషయానికి వస్తే... ఇప్పటికే 2024 లో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం, జనక అయితే గనక వంటి సినిమాలతో వరుసగా మంచి సక్సెస్ ని చూశారు సుహాస్. ఇక ఇప్పుడు ఆయన ఖాతాలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. 'ఓ భామ అయ్యో రామ' సినిమాతో పాటు 'ఆనందరావు అడ్వెంచర్స్', 'కేబుల్ రెడ్డి' వంటి సినిమాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'ఓ భామ అయ్యో రామ' గ్లింప్స్ ప్రస్తుతం వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది.


Also Readబరోజ్ రివ్యూ: మోహన్ లాల్ దర్శకుడిగా మారిన సినిమా - ఎలా ఉందంటే?