Pawan Kalyan's OG Third Single Guns N Roses Song Released: ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'OG'. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాంగ్స్, బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. తాజాగా మూడో పాట 'గన్స్ అండ్ రోజెస్' విడుదల చేయగా ఆకట్టుకుంటోంది.
ఫైర్ స్ట్రోమ్‌ను మించి...
ఫస్ట్ సాంగ్ ఫైర్ స్ట్రామ్ 'ఓజాస్ గంభీర' యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మెలోడీ 'సువ్వి సువ్వి' సాంగ్ సైతం ఎంతో ఆకట్టుకుంది. ఈ రెండింటినీ మించేలా 'గన్స్ అండ్ ఓజెస్' కంపోజ్ చేశారు తమన్. పవర్ స్టార్ పవర్ ఫుల్ గ్రేస్, జోష్ మూవీలో గ్యాంగ్ స్టర్ ఎలివేషన్‌కు అనుగుణంగా మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఈ పాటలో ఎక్కువ భాగం బీజీఎం హైలైట్‌గా నిలిచింది. ఫస్ట్ గ్లింప్స్‌లో హైలైట్ అయిన 'హంగ్రీ చీతా'నే గన్స్ అండ్ రోజెస్ సాంగ్. 'ఫైర్ స్ట్రామ్' మించిపోయేలా పవర్ ఫుల్ 'ఓజీ'ని కళ్లకు కట్టేలా సాంగ్ చేశారు. థియేటర్స్ మోత మోగడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక స్పెషల్ బీజీఎం వీడియోస్ 'హంగ్రీ చీతా', 'ట్రాన్స్ ఆఫ్ ఓమి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ డ్రామాకు పర్ఫెక్ట్ ఎలివేషన్ వచ్చేలా క్రియేట్ చేశారు తమన్.
Also Read: సౌందర్యతో పాటు నేనూ వెళ్లాల్సింది - భర్త చనిపోయిన వారానికే రెండో పెళ్లి ప్రచారం చేశారన్న మీనా
ట్రైలర్ కోసం వెయిటింగ్
సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న 'OG' వరల్డ్ వైడ్‌గా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో టీం బిజీగా ఉంది. మూడు పాటలు హైలెట్ కావడంతో ట్రైలర్‌పైనే అందరి దృష్టి ఉంది. ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ నెల 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగనుండగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో 50 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు సమాచారం. అటు తెలుగు రాష్ట్రాల్లో 19 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా... ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు.