పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో సుజీత్ (Sujeeth) ఒకరు. తనతో పాటు కో - ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన కథానాయకుడిని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో... ఆ విధంగా, అంచనాలకు మించి హీరోని ప్రజెంట్ చేశారు 'ఓజీ'లో (OG Movie). ఈ సినిమా ఒక్కటే కాదు... అంతకు మించి ఆయన ప్లాన్ చేశారు. అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్ దాచి ఉంచారు. అది ఇవాళ రివీల్ అయింది.
సినిమాకు ముందు జరిగిన కథ...
సుభాష్ చంద్రబోస్ లింక్ కూడా!
'ఓజీ' విడుదలకు సమయం దగ్గర పడిన తరుణంలో ఒక సర్ప్రైజ్ అంటూ ఫ్యాన్స్ అందరి చేత గేమ్ ఆడించారు. లక్ష మంది గేమ్ ఆడితే సర్ప్రైజ్ రివీల్ అవుతుందని తెలిపారు.
Also Read: ఓజీ ఫస్ట్ రివ్యూ... పవన్ ఎలివేషన్ పీక్స్, యాక్షన్ బ్లాస్ట్ అంతే - అభిమానులకు పండగ
'ఓజీ' గేమ్ అన్ లాక్ అయ్యే కొలదీ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. మధ్యలో సుభాష్ చంద్రబోస్ ఎందుకు కనిపించారు? అని అభిమానులలో క్యూరియాసిటీ పెరిగింది. అందుకు రీజన్, ఆ సర్ప్రైజ్ ఇవాళ రివీల్ అయ్యింది.
'ఓజీ' కామిక్ బుక్ రూపొందించారు దర్శకుడు సుజీత్. ఆ పుస్తకానికి 'ఓజీ: ద ఫస్ట్ బ్లడ్' అని పేరు పెట్టారు. ఆ బుక్ కవర్ పేజీ మీద సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. కటానాకు ఒక వైపు పవన్ కళ్యాణ్ ఉంటే మరొక వైపు నేతాజీ ఉన్నారు. మరొక మహిళ, ఆవిడ చేతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నారు. 'ఓజీ' సినిమాకు ముందు జరిగే కథగా కామిక్ బుక్ రూపొందించామని సుజీత్ తెలిపారు. త్వరలో ఆ కామిక్ బుక్ అందరికీ అందుబాటులోకి రానుంది. మరి ఇది సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందో? లేదో!?
Also Read: ఓజీ vs వీరమల్లు... పవర్ స్టార్‌తో పవన్ కళ్యాణ్‌కే పోటీ... బిజినెస్‌లో ఇంత డిఫరెన్స్ ఏంటి సామి!
'ఓజీ' సినిమా విషయానికి వస్తే... రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ సాధిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ నంబర్స్ నమోదు చేసింది. మొదటి రోజు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం. అంతకు మించి ఎక్కడికి వెళుతుంది? అనేది ప్రీమియర్స్ నుంచి వచ్చే టాక్ బట్టి డిసైడ్ అవుతుంది.