మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'ఓదెల 2' (Odela 2 Movie). సంపత్ నంది క్రియేట్ చేసిన, 2021లో విడుదలై విజయం సాధించిన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్ ఇది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు.


ఏప్రిల్ 17న 'ఓదెల 2' విడుదల!
Odela 2 Release Date: ఏప్రిల్ 17వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో 'ఓదెల 2' విడుదల చేయనున్నట్లు ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. నిజం చెప్పాలంటే... ఏప్రిల్ 18న అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న 'ఘాటీ' విడుదల చేయనున్నట్లు గతంలోనే చెప్పారు. అయితే ఆ సినిమా వాయిదా పడిందని ఫిల్మ్ నగర్ టాక్. దాంతో ఏప్రిల్ 18కి ఒక్క రోజు ముందు విడుదల తేదీపై కర్చీఫ్ వేసింది తమన్నా. వేసవిలో థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.






Odela 2 Movie Director: 'ఓదెల 2' చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంస్థల మీద డి మధు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాలో నటించిన హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ సైతం ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. అయితే ఆ కథను ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లారు సంపత్ నంది.


Also Read: 'జీ తెలుగు'లో చామంతి టాప్... మరి, 'స్టార్ మా'లో? ఈ వీక్ టీఆర్పీ లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో తెలుసా?



నాగ సాధువు పాత్రలో తమన్నా!
Tamannaah Bhatia role in Odela 2: 'ఓదెల 2' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న నాగ సాధువు పాత్రలో కనిపించనున్నారు. తెలుగు తెరపై తొలిసారి అటువంటి క్యారెక్టర్ చేస్తున్న కథానాయికగా తమన్నా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇటీవల కుంభమేళా సందర్భంగా కాశీ నగరంలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. ఈ రోజు విడుదల తేదీ అనౌన్స్ చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఓటీటీ రైట్స్‌ కూడా మంచి రేటుకు అమ్ముడైనట్టు సమాచారం.


Odela 2 movie cast and crew: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళా దర్శకత్వం: రాజీవ్ నాయర్, ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాత: డి మధు, క్రియేటెడ్ బై: సంపత్ నంది, నిర్మాణ సంస్థలు: మధు క్రియేషన్స్ - సంపత్ నంది టీమ్‌ వర్క్స్, దర్శకత్వం: అశోక్ తేజ.