పాన్ ఇండియా సినిమాకు సరికొత్త అర్థం చెప్పడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నారట. పాన్ ఇండియా కాదు, తర్వాత నెక్స్ట్ సినిమాను ఆల్ ఓవర్ ఇండియాలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు పాన్ ఇండియా అంటే హిందీతో పాటు నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాలను విడుదల చేస్తున్నారు. అంతకు మించి అనేలా తారక్ సినిమా రిలీజ్ ఉంటుందట.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాతో నార్త్ ఇండియాలో ఎన్టీఆర్‌కు ఫ్యాన్ బేస్ పెరిగింది. అయితే, ఆ ఫాలోయింగ్ మెట్రో సిటీస్ వరకూ మాత్రమే పరిమితం ఆల్ ఓవర్ ఇండియాలో, అన్ని రాష్ట్రాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సుమారు తొమ్మిది భాషల్లో ఎన్టీఆర్ - కొరటాల శివ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
తొమ్మిది భాషల్లో ఎన్టీఆర్ 30?
'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమా ఇది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ... ఇలా మొత్తం తొమ్మిది భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని టాక్.
ఉత్తరాదిలో హిందీ చలన చిత్ర పరిశ్రమను మించినది లేదు. మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ... ఇలా నార్త్ ఇండియాలో ప్రాంతీయ భాషలలో సినిమాలు వస్తున్నాయి. అయితే... ఉత్తరాదిలో రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మంది హిందీ సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి హిందీ మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా సినిమా విడుదలకు ప్లాన్స్ రెడీ చేస్తున్నారట.
కథ కూడా మారుతోందా?
లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ఏంటంటే... ఈ సినిమా రిలీజ్ ప్లాన్స్ మాత్రమే కాదు, కథ కూడా మారుతోందట! ముందుగా అనుకున్న కథను పక్కన పెట్టేసిన కొరటాల శివ, ఇప్పుడు కొత్త కథను రెడీ చేసే పనిలో పడ్డారట. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా మార్కెట్‌లో వచ్చిన ఇమేజ్, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నయా స్టోరీ స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చేశారట. అదీ సంగతి!
Also Read : ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న సకల అస్త్రాలకు అధిపతి
ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో మరొక హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్.
కొరటాల శివ సినిమా తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చర్చల దశలో ఉంది.