ఎన్టీఆర్... ఎన్టీఆర్... ఎన్టీఆర్... ఇప్పుడు జాతీయ స్థాయిలో యంగ్ టైగర్ పేరు మారుమోగుతోంది. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల పరంగానూ తారక్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల తారక రాముడిని భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు, కేంద్ర మంత్రి అమిత్ షా కలిశారు. త్వరలో హిందీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన హిందీ సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 9న సినిమా విడుదల కానుంది. హిందీలో మాత్రమే కాదు... తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. విడుదలకు ముందు... భాగ్య నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు.
Brahmastra Pre Release Event At Hyderabad : 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అందుకు రామోజీ ఫిల్మ్ సిటీకి వేదిక రెడీ అవుతోంది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారని ఈ రోజు చిత్ర బృందం తెలియజేసింది.
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో 'బ్రహ్మస్త్ర' సౌత్ వెర్షన్స్ విడుదల అవుతున్నాయి. ఆయనకు ఎన్టీఆర్ సన్నిహితుడు. అలాగే, 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్ నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు ఎన్టీఆర్‌తో స్నేహం ఏర్పడింది. ఇప్పుడీ 'బ్రహ్మాస్త్ర' సినిమాలోనూ ఆమె కథానాయిక. తనకు సన్నిహితులు చేసిన సినిమా కావడంతో ఎన్టీఆర్ అతిథిగా వస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా!
Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?
తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో ఈ సినిమా విడుదల అవుతోంది. సకల అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం అంటూ సినిమా కథాంశం గురించి వివరిస్తున్నారు. హిందీ మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.
'బ్రహ్మాస్త్ర' సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. మూడు భాగాలుగా సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. అందులో ఫస్ట్ పార్ట్ 'శివ' ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. అయితే... ఈ సినిమాకు బాయ్ కాట్ సెగ తగులుతోందని బాలీవుడ్ అంచనా వేస్తోంది. ఈ సినిమా నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు కావడం... హీరో హీరోయిన్లు ఇద్దరూ హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తారలుగా వెలుగొందిన వారి వారసులు కావడం అందుకు కారణం. ఈ మధ్య ఆలియా భట్ కూడా 'సినిమా చూస్తే చూడండి, లేదంటే మానేయండి' అని రియాక్ట్ కావడం కూడా బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి.
Also Read : తెలుగులో డిజాస్టర్ దిశగా 'లైగర్', హిందీలో బెటర్ - రోజు రోజు విజయ్ దేవరకొండ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?