NTR Set To Explore With Rishab Shetty Kantara Part 3: కాంతార... ఈ పేరు వింటేనే మనకు బాక్సాఫీస్ రికార్డులు గుర్తొస్తాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా 2022లో చిన్న సినిమాగా రిలీజై దాదాపు రూ.400 కోట్లు వసూళ్లు చేసింది ఈ మూవీ. దీనికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ హీరో రిషభ్ శెట్టితో ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకుందనే టాక్ వినిపిస్తోంది.

మూడో పార్ట్‌లో ఎన్టీఆర్

ఈ మూడో పార్ట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా భాగం కానున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రిషభ్ శెట్టితో ఎన్టీఆర్‌కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దీంతో వీటికి బలం చేకూరినట్లయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కన్నడ భాషలోనూ ఎన్టీఆర్ ఫుల్ క్రేజ్ కొనసాగుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఈ రూమర్లపై ఇప్పటివరకూ అటు రిషభ్ కానీ ఇటు చిత్ర నిర్మాణ సంస్థ కానీ రియాక్ట్ కాలేదు.

Also Read: పాక్ క్రికెటర్‌తో పెళ్లి... ఇండియన్ క్రికెటర్‌‌తో రిలేషన్ షిప్ రూమర్స్ - మిల్కీ బ్యూటీ తమన్నా రియాక్షన్ ఇదే

ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మూవీ నటిస్తుండగా... ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతుండగా... రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న మూవీ రిలీజ్ కానుంది.

కాంతార చాప్టర్ 1 కంప్లీట్

ఇక, 'కాంతార చాప్టర్ 1' షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని హీరో రిషభ్ స్వయంగా తెలుపుతూ... భారీ యాక్షన్ సీక్వెన్స్ సెట్స్, అడవిలో షూటింగ్ విజువల్స్‌తో కూడిన వీడియోను రిలీజ్ చేశారు. దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ జరుగుతుండగా... మధ్యలో ఎన్నో అవాంతరాలను అధిగమించి షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిపారు. 

ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి మొదలైందో దానికి ముందు జరిగిన ఘటనలను చూపించనున్నారు. పుంజుర్లి దేవునికి సంబంధించి కొంత భాగం తొలి భాగంలో చూపించగా... ఇందులో పూర్తి వివరాలు చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. కత్తి యుద్ధాలు, ఫారెస్ట్ లొకేషన్స్, లుక్స్ మూవీపై హైప్‌ను పదింతలు పంచేశాయి. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తుండగా... అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, బెంగాళీలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు. 

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక మూడో పార్ట్ కూడా ఉందని తెలుస్తుండగా... సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా టైం పడుతుందట. 'కాంతార' సిరీస్‌కు హీరోతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రిషభ్ శెట్టి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.200 కోట్ల వరకూ ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.