మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)ను దగ్గర నుంచి చూడాలని గుడివాడకు చెందిన ఓ వీరాభిమాని 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. ఆ అబ్బాయికి మాటలు రావు. అది తెలిసి అతనితో ఫోటో దిగారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ మీద ప్రేక్షకులకు ఎంత అభిమానం ఉందనేది చెప్పడానికి అదొక ఉదాహరణ మాత్రమే. 'వార్ 2' విడుదల నేపథ్యంలో ఓ థియేటర్ దగ్గర ఏకంగా గుడి కట్టేశారు ఎన్టీఆర్ అభిమానులు.
శైలజా థియేటర్‌లో ఎన్టీఆర్ గుడి...దిష్టి తీసి పూజలు చేస్తున్న ఫ్యాన్స్!'వార్ 2' విడుదలకు మరికొన్ని గంటల సమయం ఉంది. అయితే ఏపీలో ఏయే థియేటర్లలో సినిమా ప్రదర్శిస్తున్నారనే క్లారిటీ ఉంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. విజయవాడలోని శైలజా థియేటర్ 'వార్ 2' ప్రదర్శనకు ముస్తాబు అయింది.
శైలజా థియేటర్‌లో 'వార్ 2' ప్రదర్శిస్తున్న సంగతి తెలిసి ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ ఆ థియేటర్ దగ్గర ఒక గుడి కట్టారు. అందులో ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టారు. ఆయనకు దిష్టి తీయడంతో పాటు గుమ్మడికాయలు కొట్టి పూజలు ప్రారంభించారు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాలలో మరిన్ని థియేటర్ల దగ్గర సినిమా విడుదల రోజు భారీ హంగామా నెలకొంటుందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్ భారీ కటౌట్లు రెడీ అవుతున్నాయి. పలు థియేటర్ల దగ్గర అభిమానులు 50 నుంచి 100 అడుగుల కటౌట్లు పెట్టడంతో పాటు పూలమాలలతో పాలాభిషేకాలు చేయడానికి సిద్ధం అయ్యారు.
తెలుగులో ఎన్టీఆర్ క్రేజ్ చూసి బాలీవుడ్ షాక్!'ట్రిపుల్ ఆర్' సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆ తరువాత 'దేవర' సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆయన నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. ఇందులో హృతిక్ రోషన్ మరొక హీరో.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ స్టార్ హీరో కావడంతో ఇక్కడి మార్కెట్ మీద బాలీవుడ్ ఒక కన్నేసి ఉంచింది. రీసెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ వరకు ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర ఒక వీరాభిమాని ఎన్టీఆర్ కాళ్లకు నమస్కరించడం చూసి హృతిక్ రోషన్ షాక్ అయ్యారు. ఇప్పుడు గుడి కట్టడం వంటివి బాలీవుడ్ ప్రముఖులకు, ప్రేక్షకులకు మరింత షాక్ ఇచ్చాయి. ఎన్టీఆర్ మీద ఇంతటి వీరాభిమానం చూపిస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నారు.
హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో ఆగస్టు 14న 'వార్ 2' విడుదల కానుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. హిందీ వెర్షన్ వసూళ్ల కంటే ఒక్క రూపాయి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రావాలని, ఎన్టీఆర్ దేశమంతా కాలర్ ఎగరేసేలా చేసే బాధ్యత అభిమానులదే అని నాగవంశీ మాట్లాడిన మాటలు తెలిసినవే.
Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?