Satyadev's First Look From Rao Bahadur Movie: నిర్మాతగా సూపర్ స్టార్ మహేష్ బాబు... హీరోగా సత్యదేవ్. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ ఫేం వెంకటేష్ మహా డైరెక్షన్. ఇంకేముంది ఈ క్రేజీ కాంబో గురించి అస్సలు చెప్పాల్సిన పనే లేదు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో సహా ఇతర డీటెయిల్స్ పంచుకున్నారు మూవీ టీం.
డిఫరెంట్ టైటిల్... లుక్ అదుర్స్
బ్లఫ్ మాస్టర్ నుంచి మొన్నటి కింగ్డమ్ వరకూ ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్‌లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న సత్యదేవ్ ఈ మూవీలో విభిన్న లుక్‌లో అదరగొట్టారు. 'రావు బహదూర్' అనే టైటిల్ ఫిక్స్ చేయగా... ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అసలు గుర్తు పట్టలేని స్థితిలో ఓ వృద్ధ రాజు గెటప్‌లో ఆకట్టుకున్నారు. 'అనుమానం పెనుభూతం' అనేది ట్యాగ్ లైన్ కాగా స్టోరీపై ఇప్పుడే హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read: టాలీవుడ్ To బాలీవుడ్ - 'వార్ 2'లో డిలీటెడ్ సీన్స్ ఏంటో తెలుసా?
టీజర్ లోడింగ్...
ఈ మూవీ టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత వారం 18న డిజిటల్‌గా రిలీజ్ చేయనున్నారు. వృద్ధ రాజు రూపంలో గుబురు గెడ్డ కాస్ట్‌లీ తలపాగా ఆయన జుట్టును లాగుతున్నట్లుగా ఉన్న చిన్నారులు, వెనుక నెమలి ఈకలు ఎప్పుడూ కనిపించని ఓ డిఫరెంట్ లుక్‌లో సత్యదేవ్ కనిపించారు. స్టోరీ కూడా ఓ కొత్త తరహాలో ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.
క్షీణిస్తోన్న కులీనుల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా సాగే ఓ సైకలాజికల్ డ్రామా అని తెలుస్తోంది. ఈ మూవీని మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించబోతున్నాయి. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
'రావు బహదూర్' మూవీ ప్రపంచం కోసం రెడీ అవుతోన్న స్టోరీ అని డైరెక్టర్ వెంకటేశ్ తెలిపారు. 2026 సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. ఓ నటుడిగా ఇలాంటి మూవీ రావాలని కలలు కంటున్నట్లు హీరో సత్యదేవ్ తెలిపారు. 'ఈ రోల్ సవాల్‌తో కూడుకున్నది. నా కెరీర్‌లో మరిచిపోలేనిది. ఆ రోల్ చేసే అరుదైన అవకాశం నాకు లభించింది.' అంటూ చెప్పారు. స్మరన్ సాయి మ్యూజిక్ అందించనుండగా... కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
రీసెంట్‌గా కింగ్డమ్ మూవీలో హీరోతో సమానంగా బెస్ట్ రోల్‌లో తన నటనతో ఆకట్టుకున్నారు సత్యదేవ్. ఇప్పుడు డిఫరెంట్ స్టోరీస్‌తో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అటు, మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB29'తో బిజీగా ఉన్నారు.