మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంచలన దర్శకుడు శంకర్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ తప్పితే మరో అప్డేట్ రాలేదు. ఈ విషయంలో ఫాన్స్ మేకర్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ రాబోతుందని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే కదా.


దసరాకి 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ మరోసారి ఫ్యాన్స్ ని కి నిరాశ మిగిలింది. తాజా సమాచారం ప్రకారం దసరాకి రావలసిన 'గేమ్ చేంజర్' ఫస్ట్ సింగిల్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దసరాకి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడం లేదని పిఆర్ టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంగీత దర్శకుడు తమన్ కారణమని చెబుతున్నారు. తమన్ ఇంకా సాంగ్ ఫైనల్ మిక్సింగ్ చేయలేదట. గత కొద్ది వారాలుగా 'భగవంత్ కేసరి' సినిమాపై తమన్ ఫోకస్ చేయడం వల్ల గేమ్ ఛేంజర్ సాంగ్ ఫైనల్ మిక్సింగ్ అవ్వకపోవడం దానికి తోడు త్వరలోనే తమన్ లండన్ పర్యటన కూడా ఉండటంతో గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.


గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ కు సంబంధించి ఇప్పటికే తెలుగు వర్షన్ ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ అయిందని కానీ హిందీ, తమిళ వెర్షన్ సాంగ్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో దసరాకి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడం లేదని అంటున్నారు. దీంతో ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ వార్త విన్న మెగా ఫాన్స్ తీవ్రం నిరాశకు లోనవుతూ గేమ్ చేంజర్ మేకర్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూడాలి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర అని తెలుస్తోంది.


కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమిళ నటుడు ఎస్ జె సూర్య, సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఆగ్ర నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నర్స్​కు 'మైత్రీ' గ్రాండ్ పార్టీ!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial