Robinhood Second Single: 'వేరెవర్ యూ గో ఐ ఫాలో' అంటూ శ్రీలీలతో నితిన్ - 'రాబిన్ హుడ్' నుంచి న్యూ సాంగ్ వచ్చేసింది
Nithin Robin Hood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను సోషల్ మీడియా వేదికగా మహేశ్ బాబు రిలీజ్ చేశారు.

Nithin's Robin Hood Second Single Released By Mahesh Babu: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin), శ్రీలీల లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' (Robin Hood). యాక్షన్, కామెడీ జానర్లో రాబోతోన్న ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హీరో నితిన్ హైఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అడ్వెంచరస్ దోపిడీలు చేసే మోడరన్ రాబిన్ హుడ్‌గా కనిపించబోతున్నారు. కాగా.. ఈ సినిమా నుంచి 2 నెలల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ 'వన్ మోర్ టైం' ఆకట్టుకుంది.
తాజాగా, వాలెంటైన్స్ డే సందర్భంగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'వేరెవర్ యూ గో ఐ ఫాలో' అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ మూవీ టీం మొత్తానికి విషెష్ చెప్పారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. జీవి ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉంది. ఈ పాటలో నితిన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొయిన్ కొరియోగ్రఫీ చేయగా సింపుల్ సిగ్నేచర్ స్టెప్పులతో అలరించినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రానుంది.
Also Read: త్వరలోనే మోహన్ బాబు బయోపిక్ - కచ్చితంగా ఆ హీరోతోనే చేస్తానంటూ మంచు విష్ణు కామెంట్స్
నెల రోజుల వ్యవధిలోనే 2 సినిమాలు
అటు, నితిన్ మరో సినిమా 'తమ్ముడు'ని కూడా మేలోనే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, మేకర్స్ మాత్రం మూవీ రిలీజ్ డేట్ విషయమై ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక ఈ మూవీ గురించి ఇప్పటివరకూ పెద్దగా ప్రచారం ఏమీ జరగకపోయినా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. మే 9న సినిమాని రిలీజ్ చేసే ఆలోచనతోనే మేకర్స్ నిర్మాణ కార్యకలాపాలను చాలా వేగంగా జరుపుతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు' మూవీ క్లాసిక్ టైటిల్ నితిన్ తన సినిమా కోసం వాడుకోవడంతో సినిమాపై కొంతవరకు అంచనాలు నెలకొన్నాయి. నితిన్ నెల రోజుల్లోనే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పెట్టుకోవడంతో సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, 'బలగం'తో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి.. నెక్స్ట్ మూవీ 'ఎల్లమ్మ'లోనూ నితిన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: 22 ఏళ్ల తర్వాత యాక్టర్‌గా తమన్ - 'ఇదయమ్ మురళి' టైటిల్ టీజర్ వచ్చేసింది, వీడియో ప్రోమో చూశారా?