Nithiin's Thammudu Making Video Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు'. 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన 2 ట్రైలర్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.

యాక్షన్... కట్... అదుర్స్

బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌తో మూవీ తెరకెక్కించగా... ప్రధాన పాత్రలకు సంబంధించి కీలక సీన్స్ షూటింగ్ చేసిన దృశ్యాలను ఓ వీడియో రూపంలో అందించారు మేకర్స్. 'స్టార్మ్ ఈజ్ కమింగ్... ది హంట్ బిగిన్స్' అంటూ నితిన్ యాక్షన్ సీన్స్, లయ, వర్ష బొల్లమ్మ, స్వాసిక, సప్తమిగౌడలపై తీసిన సీన్స్ చూపించారు. 'సిల్వర్ స్క్రీన్‌పై గ్రేడ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు పడిన శ్రమ, బాధ, అవిశ్రాంత కృషి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Also Read: రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్‌కు సారీ - తన కామెంట్స్‌పై ప్రొడ్యూసర్ శిరీష్ వివరణ... కాంట్రవర్సీకి చెక్ పడినట్లేనా?

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా... ఎంసీఏ, వకీల్ సాబ్ ఫేం వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. నితిన్ సరసన వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే స్వాసిక, సౌరభ్ సచ్ దేవ్ కీలక పాత్రలు పోషించారు. సిస్టర్, బ్రదర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కుతోంది. సినిమాలో నితిన్ ఆర్చర్‌గా కనిపిస్తున్నారు. 'ఇచ్చిన మాట కోసం... అక్క కోసం ఓ తమ్ముడు చేసిన యుద్ధమే' ఈ సినిమా స్టోరీ లైన్.

'అంబర గొడుకు' అనే ఊరి చుట్టూ మూవీ తిరుగుతోందని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. మూవీపై భారీ హైప్ క్రియేట్ చేయగా... రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులుగా నితిన్ సరైన హిట్ కోసం చూస్తున్నారు. లాస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ట్రైలర్స్ బట్టి నితిన్ ఖాతాలో మరో హిట్ పడడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

'లయ'పై నితిన్ ప్రశంసలు

మూవీ ప్రమోషన్లలో భాగంగా నితిన్‌తో పాటు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తెలుగు రుచులు ఆస్వాదిస్తూ వెరైటీగా చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ ఎక్కువగా కష్టపడ్డారని ఆమెపై నితిన్ ప్రశంసలు కురిపించారు. అడివిలో 65 రోజులు చెప్పులు లేకుండా వర్క్ చేశారని అన్నారు.