Harshali Malhotra As Janani In Balakrishna Akhanda 2 Movie: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అవెయిటెట్ మూవీ 'అఖండ 2'. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ మూవీ టీజర్ ఇటీవల ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టీం స్పెషల్ అప్డేట్ ఇచ్చింది.
కీ రోల్‌లో 'భజరంగీ బాయిజాన్' ఫేం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'భజరంగీ బాయిజాన్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన హర్షాలీ మల్హోత్ర 'అఖండ 2'లో కీలక పాత్రలో కనిపించనున్నారు. మూవీలో ఆమె జనని పాత్రలో కనిపించనున్నట్లు టీం తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఆమెను స్వాగతిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'ఓ దేవదూత చిరునవ్వు. బంగారు హృదయం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 'భజరంగీ'లో మున్నీ పాత్రలో నటించిన హర్షాలీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'అఖండ 2'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ - 'వార్ 2' కోసం డిఫరెంట్ ప్రమోషన్ వార్... క్రేజ్ అలాంటిది మరి
సీరియల్స్ To హిట్ మూవీ
ముంబయికి చెందిన హర్షాలీ మల్హోత్రా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టారు. పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించారు. 2015లో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ బాయిజాన్' సినిమాలో మున్నీ రోల్‌లో నటించారు. బధిర బాలిక పాత్రలో ఆమె తన నటనతో చెరగని ముద్ర వేశారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సల్మాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. హర్షాలీ నటనకు మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. సినిమాకు సైతం పలు అవార్డులు దక్కాయి. పాక్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి భారత్‌లో తప్పిపోవడంతో ఆ అమ్మాయిని తిరిగి తన ఇంటికి ఎలా చేర్చారనేదే 'భజరంగీ బాయిజాన్' స్టోరీ.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా 'అఖండ 2: తాండవం' తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ట్రెండింగ్‌గా నిలిచింది. బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అంచట, గోపీ అచంట మూవీని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ రోల్‌లో నటిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశలో ఉంది. దసరా సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.