'హిట్' ఫ్రాంచైజీ తర్వాత హీరోయిన్ కోమలీ ప్రసాద్ (Komalee Prasad) పేరు ఎక్కువ మందికి తెలిసింది. అయితే ఆవిడ అంతకు ముందు పాపులరే. 'నా నీడ పోయింది' అంటూ ఆనంద్ రవి హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందించిన సినిమాలో నటించింది. 'రౌడీ బాయ్స్' కూడా చేసింది. కోమలీ ప్రసాద్ యాక్టర్ మాత్రమే కాదు... డాక్టర్ కూడా! చదువు పూర్తి కావడంతో యాక్టింగ్ వదిలేసి డాక్టర్ వృత్తిలోకి కోమలీ ప్రసాద్ వెళుతున్నారని వార్తలు వచ్చాయి. వాటిని ఆవిడ ఖండించారు.

Continues below advertisement

సదరు వార్తల్లో ఎటువంటి నిజం లేదు!''అందరికీ నమస్కారం! నేను డాక్టర్ అయ్యాను అని, అందువల్ల నటనకు పూర్తిగా దూరం అయ్యానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొందరు తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురిస్తున్నారు. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఆ రూమర్లను నిజం అన్నట్టు ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎంతో కష్టపడి సినిమాల్లో నా కెరీర్‌ కంటిన్యూ చేస్తూ ఈ స్థాయికి వచ్చా'' అని కోమలీ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ పరమ శివుని ఆశీస్సులతో నటిగా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నానని ఆమె తెలిపారు.

చివరి శ్వాస వరకు నటిస్తుంటా - కోమలీ ప్రసాద్కోమలీ ప్రసాద్ యాక్టింగ్ వదిలేస్తుందని వచ్చిన వార్తలు తనతో పాటు తన శ్రేయోభిలాషనులను సైతం ఆందోళనకు గురి చేశాయని ఆమె వివరించారు. ఇంకా కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ... ''నా చివరి శ్వాస వరకు నటిగా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. చిత్రసీమలో నా ప్రయాణంలో నాకు వెన్నంటే ఉన్న నా శ్రేయోభిలాషులు అందరికీ, నా కంటే ఎక్కువగా నన్ను నమ్మిన వ్యక్తులు అందరికీ థాంక్స్. ప్రస్తుతం జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకుంటున్నాను. త్వరలో కొత్త సినిమా వివరాలు చెబుతా'' అని అన్నారు.

Continues below advertisement

Also Read: 'గేమ్ చేంజర్' అసలు నిర్మాత ఎవరు? జీ స్టూడియోస్, 'దిల్' రాజు మధ్య ఏం జరిగింది? తెరపైకి కొత్త కాంట్రవర్సీ

'హిట్ 3'తో కోమలీ ప్రసాద్ మరో విజయం అందుకున్నారు. త్వరలో రక్షిత్ అట్లూరికి జంటగా ఆవిడ నటించిన 'శశివదనే' విడుదలకు రెడీ అవుతోంది. 'లూజర్', 'మోడ్రన్ లవ్ హైదరాబాద్', 'టచ్ మీ నాట్' వెబ్ సిరీస్‌లు కూడా ఆవిడ చేశారు.

Also Readప్రభాస్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకు... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'దిల్' రాజు సినిమా