Nithiin Extra Ordinary Man: వచ్చే రెండు నెలల్లో పలువురు యంగ్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో యంగ్ హీరో నితిన్ కూడా ఉన్నాడు. నితిన్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’పై చాలా నమ్మకంగా ఉన్నామని మూవీ టీమ్ చెప్పుకొచ్చారు. ఈవెంట్‌లో దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత సుధాకర్ రెడ్డితో పాటు హీరో నితిన్ కూడా పాల్గొన్నాడు.
రిలీజ్ తర్వాతే మాట్లాడతాను..
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డితో పాటు నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ చూస్తే ఇదొక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత కూడా మరోసారి ఇదే విషయం ప్రూవ్ అయ్యింది. అయితే సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న నిర్మాత సుధాకర్ రెడ్డి.. ఇప్పుడు మూవీ గురించి ఏం మాట్లాడను అని రిలీజ్ తర్వాతే మాట్లాడతాను అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చారు.
పదిరెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్..
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ఔట్‌పుట్ బాగా రావడానికి రెండేళ్లు కష్టపడ్డామని దర్శకుడు వక్కంతం వంశీ బయటపెట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేశామని అన్నారు. ట్రైలర్ కంటే సినిమాలో పదిరెట్లు ఎంటర్‌టైన్మెంట్ ఎక్కువే ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నితిన్ కూడా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ గురించి మాట్లాడాడు. నటుడిగా తన 21 ఏళ్ల కెరీర్‌లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ తన 32వ సినిమా అని గుర్తుచేసుకున్నాడు. ఈ మూవీలో తన క్యారెక్టరైజేషన్ బెస్ట్‌గా ఉంటుందని అన్నాడు. వక్కంతం వంశీ రైటర్‌గా పనిచేసిన సినిమాలు అన్నింటితో పోలిస్తే.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఏ మాత్రం తగ్గదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే ఈ మూవీ గోల్ అని, నాన్ స్టాప్‌గా అందరినీ నవ్విస్తామని మాటిచ్చాడు. బాగా డాన్స్ చేసి చాలా కాలమవుతుందని, ఈ మూవీలో లాస్ట్ సాంగ్ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నానని చెప్పాడు. ‘‘డిసెంబర్ 8న గుద్దబోతున్నాం. ఇది కన్‌ఫర్మ్.. రాసి పెట్టుకోండి’’ అంటూ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు నితిన్.
‘భీష్మ’ తరహాలో..
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ చూస్తుంటే నితిన్ ఇంతకు ముందు నటించిన ‘భీష్మ’ మూవీ గుర్తొస్తుందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిగా కామెడీ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ‘భీష్మ’.. నితిన్‌కు మంచి హిట్ ఇచ్చింది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ కూడా అలాగే హిట్ ఇస్తుందని నితిన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ మూవీలో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా.. డిసెంబర్ 8న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. చాలాకాలం తర్వాత ఒక తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు హరీష్ జయరాజ్. సీనియర్ హీరో రాజశేఖర్.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్టు ట్రైలర్‌లో రివీల్ చేశారు.
Also Read: సోషల్ మీడియాలో ఆలియా డీప్‌ఫేక్ వీడియో హల్‌చల్ - స్పందించడానికి ఇష్టపడని నటి!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply