Nikhil Siddharth Reacts on Karthikeya 2 Won National Award: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా తెలుగు సినిమా 'కార్తికేయ 2' నిలిచింది. 2022లోని చిత్రాలను ఎంపిక చేస్తూ శుక్రవారం (ఆగస్టు 16) కేంద్రం జాతీయ అవార్డుకు ఎన్నికలైన సినిమాలు, నటీనటుల జాబితాను రిలీజ్‌ చేసింది. ఇందులో తెలుగు సినిమా కార్తికేయ 2 ఉండటం విశేషం. ఈ సినిమా జాతీయ అవార్డుకు గెలడం కార్తీకేయ 2 టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. తాజాగా హీరో నిఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్‌ చేశాడు. ఈ సందర్భంగా కార్తికేయ 2 నేషనల్‌ అవార్డు గెలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. 


ఎంటైర్ టీంకి, ఆడియన్స్ కి థ్యాంక్స్


వీడియోలో నిఖిల్‌ మాట్లాడుతూ.. నమస్తే అండి. నేను మీ నిఖిల్‌. ఇప్పుడే నేనొక అద్బుతమైన న్యూస్‌ విన్నాను. మన సినిమా కార్తికేయ 2 నేషనల్‌ అవార్డు గెలుచుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి ఈ అవార్డు రావడం కారణం మా ఎంటైర్‌ టీం. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, కృష్ణ ప్రసాద్, వివేక్‌ గారు.. అలాగే మై బ్రదర్, డైరెక్టర్ చందూ మొండేటి, మా హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌, మా మ్యూజిక్ డైరెక్టర్‌ కాలభైరవ..


అదే విధంగా మా డీవోబీ కార్తీక్‌ ఘట్టమనేకి అందరికి థ్యాంక్స్‌ చెప్పాలి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు అందరు చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన మా సినిమాకు ఆదరించి ఇంత పెద్ద సక్సెస్‌ ఆడియన్స్‌కి ధన్యవాదాలు. అలాగే మా సినిమాను నేషనల్‌ అవార్డుకు ఎన్నిక చేసిన కౌన్సిల్‌కి కూడా థ్యాంక్యూ" అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే కార్తికేయ 2కి నేషనల్‌ అవార్డు గెలవడంపై నిర్మాతలు సైతం ఆనందం వ్యక్తం చేశారు. 






కాగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా 2022లో విడుదలైన ఈ సినిమా పాన్‌ స్థాయిలో హిట్‌ కొట్టింది. శ్రీకృష్ణ తత్వాన్ని సినిమా రూపంలో చూపించి పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అందుకున్నాడు డైరెక్టర్‌ చందూ మొండేటి.  జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. వరల్డ్‌ వైడ్‌గా సుమారు రూ. 121 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది ఈసినిమా. ఇక బాలీవుడ్‌ లెజెండరి నటుడు అనుపమ్ ఖేర్ అద్భుతమైన యాక్టింగ్, నిఖిల్ ప్రామిసింగ్ స్క్రిప్ట్ సెలక్షన్, చందూ మొండేటి డైరెక్టింగ్ ప్రతిభ, శ్రీకృష్ణ తత్వాన్ని వెండితెరపై పోట్రే చేసిన విధానానికి జాతీయ అవార్డుల కమిటి జ్యూరీ సైతం ఫిదా అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు జాతీయ అవార్డు వరించటంతో  చిత్రబృందం కష్టానికి ప్రతిఫలం దక్కినట్లైంది.


Also Read: ‘మిస్టర్ బచ్చన్’కు ఫ్లాప్ టాక్- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉంటుందా? ఉండదా?