Nidhhi Agerwal About HHVM Sequel: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా... సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Continues below advertisement


ఫస్ట్ పార్ట్ రిలీజ్ తర్వాత...


'హరిహర వీరమల్లు' పార్ట్ 2 కూడా 20 నిమిషాల షూటింగ్ పూర్తి చేసినట్లు నిధి తెలిపారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత... త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా ఓ విజువల్ వండర్‌లా ఉంటుందని... ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని నిర్మించారని అన్నారు. 'ఈ సినిమా విజయంపై టీం మొత్తం ఎంతో ధీమాగా ఉన్నాం. ప్రాజెక్ట్ ప్రారంభంలో ఎన్నో రూమర్స్ వచ్చినా ట్రైలర్ రిలీజ్ తర్వాత వాటన్నింటికీ చెక్ పడింది.' అని అన్నారు.


'హరిహర వీరమల్లు' కోసం పవన్ సర్ ఎంతో కష్టపడ్డారని... ఎన్నో వర్క్ షాప్స్ చేశారని చెప్పారు నిధి. 'సినిమాలోని ప్రతీ విభాగంలోనూ పవన్ సర్ భాగమయ్యారు. సాంగ్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఇలా అన్నింటికీ సలహాలిచ్చారు. ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించగా... డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఫస్ట్ ఈ మూవీనే పూర్తి చేశారు. విజయవాడలో షూటింగ్ చేసినన్ని రోజులు విరామ సమయంలో ఓ వైపు మీటింగ్‌లో పాల్గొంటూనే షూటింగ్‌కు వచ్చేవారు. 5 ఏళ్ల కాలంలో ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.' అని నిధి పేర్కొన్నారు.


Also Read: నాగార్జున అంత ఈజీగా ఒప్పుకోలేదు... 40 ఏళ్ళలో మొదటిసారి ఆ మాత్రం జాగ్రత్త ఉండొద్దూ!


రన్ టైం ఎంతంటే?


'హరిహర వీరమల్లు' పూర్తి రన్ టైం 2 గంటల 42 నిమిషాలు కాగా... సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ మూవీ చూసిన బోర్డు సభ్యులు దర్శక నిర్మాతలపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. బలమైన స్టోరీ, అద్భుతమైన విజువల్స్ కట్టి పడేస్తాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో అంచనాలు పదింతలయ్యాయి.


ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి


ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 20న భారీ స్థాయిలో నిర్వహించాలనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత తిరుపతిలో నిర్వహించాలని ప్లాన్ చేయగా... రీసెంట్‌గానే వెన్యూ మార్చారు. సాగర తీరం విశాఖలో ఈవెంట్ నిర్వహించనుండగా... దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ఈవెంట్‌లో పవన్ స్పీచ్‌పైనే అందరి దృష్టి ఉంది.


'భీమ్లా నాయక్' తర్వాత వస్తోన్న మూవీ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 17వ శతాబ్ధపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ధర్మం కోసం పోరాడే యోధుడిగా పవర్ స్టార్ కనిపించనున్నారు. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా... బాబీ డియోల్, నోరా ఫతేహి, అనుపమ్ ఖేర్, నాజర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు.