నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన సినిమా '18 పేజీస్' (18 Pages Movie). సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుకుమార్ (Sukumar) అందించిన కథతో రూపొందిన చిత్రమిది. దీనికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమిళ హీరో శింబు పాడిన 'టైమ్ ఇవ్వు పిల్లా...' పాటను తాజాగా విడుదల చేశారు.
మార్కెట్‌లోకి కొత్త బ్రేకప్ సాంగ్!
Time Ivvu Pilla Song From 18 Pages : '18 పేజెస్' చిత్రంలో 'టైమ్ ఇవ్వు పిల్లా టైమ్ ఇవ్వు' పాటను శింబు ఆలపించిన సంగతి తెలిసింది. లేటెస్టుగా విడుదల అయిన ఈ సాంగ్ లిరికల్ వీడియో వింటే... బ్రేకప్ సాంగ్ అని ఈజీగా అర్థం అవుతోంది. అబ్బాయికి అమ్మాయి హ్యాండ్ ఇస్తే? కాన్సెప్ట్ బేస్ చేసుకుని రాసినట్టు ఉన్నారు.
బ్రేకప్ బాధలో ఉన్న అబ్బాయి... తన ప్రేయసి మరొకరితో ఇన్‌స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేస్తే? అమ్మాయి గూగుల్ కొటేషన్స్ పోస్ట్ చేస్తే? ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్న యువకుడి మనసును శ్రీమణి పాటలో రాశారు. ఫుల్ బాటిల్ కొట్టినా ఎక్కలేదు, రోస్టింగ్ చేసినావు వంటి యూత్ పదాలు పాటలో ఎక్కువ వినిపించాయి. శింబు వాయిస్ ఈ పాటను ట్రెండీగా మార్చింది. నిఖిల్ (Nikhil Siddharth) డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి.
'టైమ్ ఇవ్వు పిల్లా' పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మాదాపూర్ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ పాట కంటే ముందు '18 పేజెస్' నుంచి 'నన్నయ్య రాసిన...' పాటను విడుదల అయ్యింది. దానికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. టీజర్ కూడా ట్రెండ్ అయ్యింది.
Also Read : మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!
'కార్తికేయ 2' తర్వాత మరోసారి!
'18 పేజెస్' సినిమాలో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్. నిఖిల్, ఆమె నటించిన రెండో చిత్రమిది. తెలుగులో మాత్రమే కాదు... హిందీలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కార్తికేయ 2' సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
'18 పేజీస్'తో 'కార్తికేయ 2' సక్సెస్ ట్రాక్‌ను నిఖిల్, అనుపమ కంటిన్యూ చేయాలని కోరుకుందాం! వీళ్ళ హిట్ సెంటిమెంట్‌కు తోడు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'కాంతార' వంటి విజయవంతమైన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న చిత్రమిది. 'కుమారి 21 ఎఫ్' తర్వాత మరోసారి సూర్యప్రతాప్ పల్నాటి సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అదీ సంగతి!
ఈ సినిమాలో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. '18 పేజెస్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై 'బన్నీ' వాసు నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అవుతోంది.