ఈ వారం సినీ అభిమానులకు ఓ రేంజిలో ఎంటర్ టైన్ మెంట్ లభించనుంది. ఈ వారం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' చిత్రంతో పాటు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' థియేటర్లలోకి అడుగు పెట్టనున్నాయి. ఇక ఓటీటీలో ఈ వారం ఏకంగా 23 కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు రెడీ అయ్యాయి.    

ఈ వారం థియేటర్లలలో విడుదలయ్యే సినిమాలు

1. భోళా శంకర్ - ఆగస్టు 11న విడుదల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపొందుతోంది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయ్యింది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2. జైలర్- ఆగష్టు 10న విడుదల

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో  మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు హిందీ నటుడు జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, రమ్య కృష్ణ, తమన్నా,  వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మరిముత్తు, నమో నారాయణ, రిత్విక్, అనంత్, శరవణన్, అరంతాంగి నిషా, మహానటి శంకర్, కలై అరసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్

1. లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 8న విడుదల

2. అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 8న విడుదల

3. జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 8న విడుదల

4. మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10న విడుదల

5. పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10న విడుదల

6. హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11న విడుదల

7. పద్మిని (మలయాళ చిత్రం) - ఆగస్టు 11న విడుదల

8. బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 12న విడుదల

అమెజాన్ ప్రైమ్

1. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 10న విడుదల

2. రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11న విడుదల

హాట్‌స్టార్

1. నెయ్‍‌మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 8న విడుదల

2. ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 8న విడుదల

3. కమాండో (హిందీ సిరీస్) - ఆగస్టు 11న విడుదల

జియో సినిమా

1. జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) - ఆగస్టు 11న విడుదల

ఆహా

1. హిడింబ (తెలుగు మూవీ) - ఆగస్టు 10న విడుదల

2. వేరే మారి ఆఫీస్ (తమిళ సిరీస్) - ఆగస్టు 10న విడుదల

3. వాన్ మూండ్రు (తమిళ మూవీ) - ఆగస్టు 11న విడుదల

జీ5

1. అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) - ఆగస్టు 11న విడుదల

2. ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 11న విడుదల

సోనీ లివ్

1. ద జెంగబూరు కర్స్ (హిందీ సిరీస్) - ఆగస్టు 9న విడుదల

2. పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 11న విడుదల

Read Also: పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, ఆయన జేబులో చేయిపెట్టి డబ్బులు తీసుకొనేంత చనువు నాది: గద్దర్ వ్యాఖ్యలు వైరల్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.Join Us on Telegram: https://t.me/abpdesamofficial