'డీజే టిల్లు' సినిమా నేహా శెట్టి కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా కంటే ముందు రెండు సినిమాలు చేశారు. అవి హిట్ కాలేదు. అమ్మాయి అందంగా ఉంటుందని, చక్కగా నటిస్తుందని పేరొచ్చినా... అవకాశాలు రాలేదు. ప్లాప్స్ ఎఫెక్ట్ పడింది. 'డీజే టిల్లు' హిట్ తర్వాత ఆమె చెంతకు అవకాశాలు వస్తున్నాయి. యువ హీరో కార్తికేయ గుమ్మకొండతో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో నటించే అవకాశం అందుకున్నారు.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంఎంటర్‌టైనర్. ఇందులో కథానాయికగా నేహా శెట్టి (Neha Shetty) ని ఎంపిక చేసినట్టు వెల్లడించారు.
ఎ.యం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ చలన చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొనగా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24న విడుదల కానుంది. అందులో చాందిని చౌదరి కథానాయిక. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.
Also Read: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?