Negative Comments on Upasana Attammas Kitchen: పద్మ విభూషణ్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఇటీవల ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు. మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన సురేఖతో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని 'అత్తమ్మాస్ కిచెన్' ద్వారా ఉపాసన సరికొత్తగా నిర్వహిస్తుంది. ఇక సురేఖ వంటలంటే మెగా ఫ్యామిలీకి చాలా ఇష్టం. దీంతో తన అత్తమ్మ వంటకాల రుచిని అందరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాటు, నాణ్యమైన ఫుడ్ అందించాలని ఉపాసన ఈ బిజినెస్ మొదలు పెట్టారు.
అప్పటికప్పుడు నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్‌ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు సురేఖ. ఈ క్రమంలో ఇటీవల సురేఖ సమ్మర్ స్పెషల్‌గా అవకాయ పచ్చడి పెట్టిన వీడియోను ఉపాసన షేర్ చేసింది. ఆనలైన్‌లో అవి భారీ అమ్ముడు కూడా పోతున్నాయి. వీటికి పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. అయితే తాజగా దీనికి సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీనికి కారణం లావణ్య త్రిపాఠి, ఆమె అత్త పద్మ. తాజాగా అత్తమ్మాస్ కిచెన్‌లో వీరిద్దరి ఫోటోల షేర్ చేయగా.. దానిపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అత్తమ్ఆస్ కిచెన్ తమ ప్రొడక్ష్ విషయంలో నాణ్యత పాటించడం లేదంటూ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు.
లావణ్య త్రిపాఠి ఫోటో షేర్ చేయడంతో..
దీని కారణం లావణ్య త్రిపాఠి, ఆమె అత్త పద్మ. అత్తమ్మాస్ కిచెన్‌లో ఆఫీషియల్ పేజీలో లావణ్య త్రిపాఠి, ఆమె అత్త పద్మ ఇద్దరు అవకాయ పచ్చడి తయారు చేస్తున్న ఫోటో షేర్ చేశారు. ఇందులో వాళ్లు చేతులకు గ్లౌజ్, తలకు క్యాప్ , మాస్క్ కానీ ధరించలేదు. అయితే, ఆ ఫోటోలపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. నేను అత్తమ్మాస్ కిచెన్ ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రొడక్ట్ విషయంలో కాస్తా సరైన నాణ్యత, విలువలు పాటించడం లేదు.. ఆవకాయ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు. జుట్టు కూడా అలా వదిలేశారు.. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి? అత్తమ్మాస్ కిచెన్ తమ ప్రొడక్ష్ విషయంలో అసలు హైజీన్ పాటిస్తుందా? లేదా? అంటూ కామెంట్స్ చేశారు. దీనికి చాలా మంది నెటిజన్లు మద్దతుగా రిప్లై ఇచ్చారు. ఇక ఈ నెగిటివ్ ఫీడ్ బ్యాక్‌పై నేరుగా 'అత్తమ్మాస్ కిచెన్' సిబ్బంది స్పందించింది. "ఇది పర్సనల్ ప్యాక్. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ అది. కాబట్టి వారు సాధారణంగా తయారు చేశారు.
ఆన్‌లైన్‌లో అత్తమ్మాస్ కిచెన్‌కు భారీ రెస్పాన్స్
నిజానికి మేము కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజిన్ పాటిస్తాం. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు వద్దు. ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం" సమాధానం ఇచ్చింది. కాగా ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రొడక్ట్స్‌ను సోషల్ మీడియా నుంచి మాత్రమే కాదు వెబ్‌సైట్ నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా. ఇప్పటికే అత్తమ్మాస్ కిచెన్‌లోని ఇన్‌స్టంట్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మార్కెట్లోనూ మంచి డిమాండ్ వస్తుందట. మార్కెట్లో ఇవి భారీగా అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ అత్తమ్మాస్ కిచెన్ వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్.
Also Read: రెండు వారాల పాటు తెలంగాణలో థియేటర్లు బంద్ - అసలు కారణం అదేనా?