యంగ్ హీరోల్లో రామ్ పోతినేని (Ram Pothineni) రూటే సపరేటు. సినిమా విడుదల సమయంలో ఆయన మీడియా ముందుకు వస్తారు. లేదంటే అజ్ఞాతంలో ఉంటారు. సోషల్ మీడియాలోనూ ఆచి తూచి పోస్టులు పెడతారు. రామ్ పోతినేని పర్సనల్ లైఫ్, ఆయన థింకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలని అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. ఇవాళ ఆయన పుట్టినరోజు (Ram Pothineni Birthday). ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూస్తే... రామ్ పోతినేనిలో ఫిలాసఫీ వున్నట్టు అర్థం అవుతోంది.


జీవితంలో అది పెద్ద విజయం అదే!
''మీ జీవితంలో అతి పెద్ద విజయం ఏది? అంటే... జీవితంలో మీరు ఎక్కువగా ప్రేమించే పని చేయగలగడమే. మీ జీవితంలో ఎక్కువ శాతం మీకు నచ్చినట్టు, నచ్చిన విధంగా జీవించడమే. ఏది చేస్తే మీకు జీవిస్తున్నట్టు అన్పిస్తుందో? ప్రాణం వున్నట్టు వుంటుందో? అది చేయడమే జీవితం. జీవితం యొక్క అర్థం అదే'' అని రామ్ పోతినేని పేర్కొన్నారు. 


''స్కూల్లో చదివే రోజుల్లో స్టేజి ప్లే (నాటకాలు) డైరెక్ట్ చెయ్యడం, యాక్టింగ్ చెయ్యడం నుంచి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో బుక్స్ చదవడం నుంచి ఇవాళ సినిమాల వరకు...'' అంటూ రామ్ పోతినేని తన పోస్ట్ మొదలు పెట్టారు. ఆ తర్వాత జీవితంలో సక్సెస్ గురించి మాట్లాడారు. అంటే... ఆయన జీవితంలో ఆయనకు నచ్చింది చేస్తున్నారని చెప్పారు. తన జీవితంలో అదే అతి పెద్ద విజయం అని పరోక్షంగా చెప్పారు. 


తన జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ (అభిమానులకు) ఆయన థాంక్స్ చెప్పారు. తన కోసం నిలబడిన వాళ్ల అంటే తనకు ఎప్పుడూ ప్రేమ వుంటుందని, ఈ జర్నీ ఎక్కడికి తీసుకు వెళుతుందో చూడాలని ఆసక్తిగా వుందని రామ్ పోతినేని తెలిపారు.


Also Read: టాలీవుడ్ స్టార్ హీరోస్‌కి ఓటు వెయ్యడానికి అంత బద్ధకమా?






బర్త్ డే స్పెషల్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ చూశారా?
'ఇస్మార్ట్ శంకర్' అంటే తెలుగు ప్రేక్షకులకు రామ్ పోతినేని పేరు ముందు గుర్తుకు వస్తుంది. అందులో మరో సందేహం అవసరం లేదు. ఇవాళ ఆయన బర్త్ డే గిఫ్ట్ కింద 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేసింది మూవీ టీమ్. మరోసారి హైదరాబాదీ శంకర్ పాత్రలో రామ్ ఇరగదీశారు.


'డబుల్ ఇస్మార్ట్' సినిమా కోసం రామ్ పోతినేని ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట. విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకునేలా, ప్రాఫిట్స్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్నారట. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!


'డబుల్ ఇస్మార్ట్' తర్వాత రామ్ పోతినేని మరో సినిమా ఏదీ యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకుడు అప్రోచ్ అవుతున్నారు. స్టోరీ లైన్స్, స్క్రిప్ట్స్ వినిపిస్తున్నారు. కానీ, రామ్ ఏ సినిమాకూ ఓకే చెప్పలేదని ఆయన క్లోజ్ సర్కిల్స్ చెబుతున్నారు.