గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా రూపొందుతున్న తాజా సినిమా (NBK 111 Movie)లో హీరోయిన్ ఎవరు? అంటే ఆడియన్స్ అందరూ లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు చెబుతారు. 'సింహ', 'శ్రీరామ రాజ్యం', 'జై సింహ' వంటి హిట్స్ తర్వాత వాళ్ళ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. అయితే... ఈ సినిమాలో నయనతార ఒక్కరే కాదని, ఆమెతో పాటు మరొక హీరోయిన్ కూడా ఉన్నారని తెలిసింది.
బాలకృష్ణతో మరోసారి చందమామ!చందమామ అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. ఆ సినిమా ఇంపాక్ట్ అటువంటిది. 'మగధీర', 'మిస్టర్ పర్ఫెక్ట్' ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో కాజల్ హీరోయిన్. బాలకృష్ణతోనూ ఆమె కాంబినేషన్ హిట్టే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'లో నటించారు. ఆ సినిమాలో 'ఆంటీ' అంటూ కాజల్‌ను బాలకృష్ణ పిలిచే సన్నివేశం విపరీతంగా పేలింది కూడా! అయితే ఆ సినిమాలో ఇద్దరి కాంబినేషన్ సీన్లు తక్కువ. ఈసారి మంచి ట్రాక్ ఉండేలా కనబడుతోంది.
Also Read: Sandeep Reddy Vanga: ప్రభాసే కాదు... రణబీర్‌తోనూ వెయిటింగే!
గోపీచంద్ మలినేని సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉంది. ఓ నాయికగా నయనతారను ఎంపిక చేశారు. మరో కథానాయికగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను ఫైనలైజ్ చేశారట. త్వరలో ఆమె చిత్రీకరణలో జాయిన్ అవుతారని తెలిసింది.
Also Read: Dhurandhar: ఆర్ఆర్ఆర్ రూటులో ధురంధర్... మళ్ళీ రణబీర్ & ఆదిత్య ధర్ ఆ తప్పు చేస్తారా?
విజయ దశమికి థియేటర్లలోకి సినిమా!?బాలకృష్ణ 111వ చిత్రమిది. అందుకని NBK 111 వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రజెంట్ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి విజయ దశమికి థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నారని తెలిసింది. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్.
