ఎవరు ఔనన్నా కాదన్నా భారతీయ సినిమా బాక్సాఫీస్ బాహుబలి, బాద్షా మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీయడమే కాదు... పాన్ వరల్డ్ ప్రమోషన్స్ ఎలా చేయాలో చూపించారు. అదీ సినిమా విడుదలకు ముందు మాత్రమే కాదు... సినిమా విడుదల తర్వాత కూడా ఎలా ప్రమోట్ చేయవచ్చో చూపించారు. ఇప్పుడు రాజమౌళి చూపించిన రూటులో వెళ్ళడానికి 'ధురంధర్' టీం రెడీ అవుతోంది. అయితే, రాజమౌళి చేసిన తప్పును వాళ్ళూ రిపీట్ చేస్తారా? అనేది చూడాలి.

Continues below advertisement

థియేటర్లలోకి 'ధురంధర్' డాక్యుమెంటరీ!పాన్ ఇండియా హిట్స్ అంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే వస్తున్నాయని, నార్త్ ఫిల్మ్ మేకర్స్ ఆ తరహా సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్నారని ఇంటా బయట విమర్శలు వచ్చిన తరుణంలో 'ధురంధర్ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా మేకింగ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Also ReadBalakrishna: అబ్బాయితో 'దేవర 2' కంటే ముందు... బాబాయి బాలకృష్ణతో!

Continues below advertisement

'ధురంధర్' కోసం బ్యాంకాక్‌లో భారీ సెట్ వేశారు. సుమారు ఐదారు ఎకరాలలో మన దాయాది దేశం పాకిస్తాన్‌లోని కరాచీ, లేయారిని తలపించే సెట్ వేశారు. అది చూసి నిజంగా పాకిస్తాన్ అని ప్రేక్షకులు నమ్మరంటే అతిశయోక్తి కాదు. అలాగే, రెండు భాగాలు తీయడానికి అయిన బడ్జెట్ చూసి కూడా జనాలు నోరెళ్లబెట్టారు. అసలు ఈ సినిమా ఎలా తీశారని ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ మీద ఒక డాక్యుమెంటరీ రెడీ చేస్తున్నారు ఆదిత్య ధర్. ప్రేక్షకులు సైతం ఆసక్తిగా చూస్తారని చెప్పవచ్చు. అయితే... ఆ డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేయడమే 'ఆర్ఆర్ఆర్' టీం చేసిన తప్పును గుర్తు చేస్తోంది. 

Also ReadRam Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' భారీ బాక్స్ ఆఫీస్ విజయం సాధించింది. ఆ సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. సినిమా మేకింగ్ మీద రాజమౌళి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. దానిని థియేటర్లలో విడుదల చేశారు. సినిమా వచ్చిన స్పందన కాదు కదా కనీసం సాధారణ సినిమా స్థాయిలో కూడా స్పందన రాలేదు. కళ్ళముందు ఆ ఉదాహరణ ఉంచుకుని మరీ 'ధురంధర్' టీం ఆ తప్పు చేస్తుందా? వెయిట్ అండ్ సి. థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే డాక్యుమెంటరీ విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

Also ReadVijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?