మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా హిట్ 'దేవర' తీశారు దర్శకుడు కొరటాల శివ. అయితే... అందులో పూర్తి కథను చెప్పలేదు. 'మీకు అది తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి' అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిన విషయమే. ఆ దేవర కథను చెప్పడానికి ముందు మరొక కథను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కొరటాల. అదీ ఈసారి అబ్బాయితో కాదు... బాబాయి బాలకృష్ణతో!

Continues below advertisement

బాలకృష్ణకు కథ చెప్పిన కొరటాల!Koratala Siva Next Movie After Devara: 'దేవర: పార్ట్ 1' తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించబోయే సినిమా ఏది? అనేది ఇప్పటి వరకు సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. ఎందుకంటే... 'దేవర' తర్వాత హిందీ డెబ్యూ సినిమా 'వార్' చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (టైటిల్ అనౌన్స్ చేయలేదు) మొదలు పెట్టారు. ఆ తర్వాత 'దేవర 2' ఉంటుందని ఎన్టీఆర్ ఫాన్స్, ఆడియన్స్ భావించారు. కానీ, ఇప్పుడు ఉండదని చెప్పాలి ఏమో!? ఎందుకంటే...  

Also ReadRam Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

Continues below advertisement

'దేవర 2' కంటే ముందు కొరటాల శివ మరొక సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అబ్బాయి ఎన్టీఆర్ హీరోగా 'జనతా గ్యారేజ్', 'దేవర' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే... ఈసారి బాబాయి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. 

Also ReadVijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

ఇటీవల బాలకృష్ణను కలిసిన కొరటాల శివ, ఆయనకు ఓ కథ చెప్పారట. దానిని సింగిల్ సిట్టింగ్‌లో బాలయ్య ఓకే చేశారట. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తారని తెలిసింది. ఆల్రెడీ బాలకృష్ణ చేతిలో ఓ సినిమా ఉంది. తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. దానితో పాటు కొరటాల శివ సినిమా కూడా చేస్తారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: Peddi: ఇంకా ఆరు రోజులే పెద్ది... దర్శకుడితో రామ్ చరణ్ సెల్ఫీ - షూటింగ్ అప్డేట్!