మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఇదొకటి. ఆల్రెడీ విడుదలైన రెండు పాటలు చార్ట్‌ బస్టర్స్ అయ్యాయి. రెండు గ్లింప్స్‌లలో విభిన్నమైన డిఫరెంట్ అవతారాల్లో కనిపించారు చరణ్. మరీ ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌ ఎక్స్ట్రార్డినరీగా ఉందని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

షూటింగ్ బ్యాలెన్స్ ఆరు రోజులే!'పెద్ది' చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకో 6 రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. జూన్‌లో థియేటర్లలోకి ఈ సినిమా రానున్న సంగతి తెలిసిందే. జూన్ 4న విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ.

Also Read: Ram Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

'పెద్ది' సినిమా సెట్స్ నుంచి విడుదలైన కొత్త స్టిల్స్‌లో బుచ్చి బాబు సానాతో కలిసి రామ్ చరణ్ కనిపించారు. లాంగ్ హెయిర్, గడ్డం, స్టైలిష్ షేడ్స్‌తో రగ్గడ్ అవతార్‌లో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా... శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. 

Also Read: Vijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?