Nayanthara Vs Dhanush: తమిళ్ కథానాయకుడు ధనుష్ (Dhanush), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) మధ్య వివాదం రాజుకుంది. అతడు పైకి కనిపించే అంత మంచి వాడు కాదు అని నయన్ సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ పోస్ట్ చేశారు. అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదానికి కారణం ఏమిటి? గొడవ ఏమిటి? ధనుష్ మీద నయన్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? వంటి వివరాల్లోకి వెళితే...


10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన ధనుష్!
నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) మధ్య ప్రేమ కథ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రజలకు తెలుసు. 'నేను రౌడీనే' (Naanum Rowdy Dhaan - తమిళంలో 'నాను రౌడీ దాన్') సినిమా సమయంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లికి దారి తీసింది. ఆ సినిమాకు ధనుష్ నిర్మాత. తన ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మీద నయనతార ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది‌.


నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైంది. అది చూస్తే... 'నేను రౌడీనే' చిత్రీకరణ సమయంలో తీసుకున్న ఒక మూడు సెకన్ల వీడియో ఉంటుంది. దాంతో వల్ల 10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీస్ పంపించారని, అది చూసి తాము షాక్ అయ్యామని తాజాగా విడుదల చేసిన లేఖలో నయనతార పేర్కొన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ధనుష్‌తో రెండేళ్లుగా తాము యుద్ధం చేస్తున్నామని, అయినా సరే ప్రయోజనం లేకుండా పోయిందని, ధనుష్ నుంచి అనుమతి లేకపోవడంతో 'నేను రౌడీనే' సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకుండా రీ ఎడిట్ చేసి డాక్యుమెంటరీ విడుదల చేయడానికి రెడీ అయ్యామని నయనతార తెలిపారు. 


'నేను రౌడీనే' పాటలు గానీ, ఆ సినిమా సమయంలో తీసుకున్న విజువల్ కట్స్ గానీ, కనీసం ఆ సినిమా సెట్స్ లో దిగిన ఫోటోలు గానీ వాడుకోవడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదని నయనతార తెలిపారు. 'నేను రౌడీనే' సినిమా పాటలను ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారంటే కారణం పాటల్లోని సాహిత్యం వల్ల అని, దానికంటే మంచి మ్యూజిక్ తమ డాక్యుమెంటరీకి లేదని భావించామని, అయితే ఆ పాటల్లోని సాహిత్యాన్ని గానీ ఆ పాటలను గానే వాడుకోవడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదని నాయనతార ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఫోనులో తీసుకున్న వీడియో సైతం వాడుకోవడానికి లేదని ఆయన లీగల్ నోటీసు పంపించారని తెలిపారు. 






వ్యక్తిగత ద్వేషంతో ధనుష్ ఇదంతా చేస్తున్నారు!
పాటల విషయంలో మానిటరీ ఇష్యూను తాను అర్థం చేసుకోగలనని, అయితే ధనుష్ తమ మీద వ్యక్తిగత ద్వేషంతో అనుమతులు ఇవ్వకుండా ఇదంతా చేస్తున్నానని నయనతార ఆరోపణలు చేశారు. 


ఆడియో లాంచ్, సినిమా వేదికలపై చాలా అమాయకంగా కనిపించే ధనుష్, మంచి మంచి మాటలు చెప్పే ధనుష్ నిజ జీవితానికి వచ్చేసరికి చాలా వేరు అని నయనతార అంటున్నారు. తన విషయంలో, తన జీవిత భాగస్వామి (విఘ్నేష్ శివన్) విషయంలో ఆయన చాలా అన్యాయం చేశారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు.


ఓ సినిమా నిర్మాత సదరు చిత్రానికి పని చేసే వారి వ్యక్తిగత జీవితాలను, స్వేచ్ఛను నియంత్రించే విధంగా నియంత కాగలడా? అని నయన్ ప్రశ్నించారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విషయంలో ధనుష్ కోర్టులో విజయం సాధించవచ్చు అని, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, దేవుడి కోర్టులో నిజాయితీ గెలుస్తుందని ఆవిడ తెలిపారు.


Also Read: షారూఖ్‌ను బీట్ చేసిన బన్నీ... 'పుష్ప 2'తో ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నయా రికార్డ్‌ - బాలీవుడ్ ఏమంటుందో తెలుసా?



తండ్రి అన్న మద్దతుతో ధనుష్ వచ్చాడు...
తండ్రి ఆశీస్సులు మద్దతుతో పాటు అన్నయ్య సపోర్టు వల్ల ధనుష్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయ్యారనే అర్థం వచ్చేలా నయనతార తన లేఖను ప్రారంభించారు. ఎటువంటి నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన మహిళ తాను అని ఆవిడ తెలిపారు. ఇవాళ తాను ఉన్న స్థాయికి చేరుకోవడానికి ఎంతో స్ట్రగుల్ అయ్యానని, సర్వైవల్ కోసం యుద్ధం చేశానని తెలిపారు. అందులో రహస్యం ఏమీ లేదన్నారు. 'నేను రౌడీనే' సక్సెస్ తర్వాత ధనుష్ దానిని జీర్ణించుకోలేకపోయారని, ఆయన ఈగో వల్లనే ఇదంతా చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీని పట్ల ధనుష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


ఇతరులు బాధపడుతుంటే ఆనందించే వ్యక్తి ధనుష్ అని నయన్ తన లేఖను ముగించారు. అంతే కాదు అతడిని తన డాక్యుమెంటరీ చూడమని సలహా ఇచ్చారు. అది చూసిన తర్వాత అయినా అతడు తన మనసును మార్చుకుంటాడేమో అని పేర్కొన్నారు. 


Also Read: 'ఓజీ'లో రమణ గోగుల పాట... పవన్ తనయుడు అకిరా నందన్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్