సెలబ్రిటీలు కొందరు తమకు తాము కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారు. మేకర్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా, ఆర్డర్ చేసినా.. ఆ లిమిట్స్‌ను దాటి వారు ఎప్పుడూ బయటికి రారు. అలాగే సీనియర్ హీరోయిన్ నయనతారకు కూడా అలాంటి కొన్ని పాలసీలు ఉన్నాయి. సీనియర్ నటీమణి కాబట్టి, ఇప్పటికీ ఆమె నటనకు ఫ్యాన్స్ ఉన్నారు, ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది కాబట్టి తన పాలసీలను పక్కన పెట్టమని చెప్పడానికి మేకర్స్ పెద్దగా సాహసం చేయరు. కానీ మొదటిసారి షారుఖ్ కోసం, తనతో నటించిన ‘జవాన్’ సినిమా కోసం నయన్ తన పాలసీలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవిధంగా నయన్‌తో పాటు షారుఖ్ ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయం పట్ల ఖుషీగా ఉన్నారు.


ప్రమోషన్స్‌కు దూరం..
నయనతార మాటంటే మాట. తనకు ఏదైనా నచ్చదు అని తేల్చేసిందంటే ఆ పనిని అసలు చేయదు. అందులో మూవీ ప్రమోషన్స్ కూడా ఒకటి. నయన్ ఎప్పుడూ తను నటించిన సినిమాను చూడండి అంటూ ప్రమోట్ చేయదు. సినిమాల ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనడానికి ఇష్టపడదు. ఇప్పటివరకు నయన్ ఎక్కువగా అవార్డ్ ఫంక్షన్స్‌లో తప్పా ఇంటర్వ్యూలో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఏదో ఒక లేడీ ఓరియెంటెండ్ చిత్రం కోసం ఒకేఒక ఇంటర్యూలో పాల్గొంటుంది తప్పా ప్రమోషనల్ టూర్స్ లాంటి వాటిలో నయన్ అసలు ఆసక్తి చూపించదు. కానీ ‘జవాన్’ కోసం ప్రమోషన్స్‌లో తను కూడా యాక్టివ్‌గా పాల్గొనాలని చూస్తోందట నయనతార.


షారుఖ్‌తో కలిసి టూర్స్‌కు సిద్దం..
అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జవాన్’ చిత్రంతో నయనతార.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఎన్నో ఏళ్లుగా సౌత్‌లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న నయన్‌కు ఇంతకు ముందు కూడా బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నయన్ మాత్రం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అట్లీతో తనకు ఉన్న స్నేహం కారణంగా, పైగా షారుఖ్ లాంటి పెద్ద నటుడితో డెబ్యూ చేయడానికి ఛాన్స్ వచ్చినందుకు ‘జవాన్’లో నటించడానికి నయన్ ఒప్పుకుంది. ఇక సినిమా పూర్తయిన తర్వాత కూడా ‘జవాన్’ కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించిందట నయన్. షారుఖ్‌తో పాటు పలు ప్రమోషనల్ టూర్స్ చేయడంతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం.


అనిరుధ్ పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్..
సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘జవాన్’ వీలైనంత త్వరగా ప్రమోషన్స్‌ను ప్రారంభించాలని చూస్తోంది. ఆ ప్రమోషన్స్‌లో షారుఖ్‌తో పాటు నయనతార కూడా పాల్గొనున్నట్టు సమాచారం. అనిరుధ్ రవిచందర్ కూడా ఈ ప్రమోషన్ టూర్స్‌లో భాగమయితే సినిమాకు వేరే లెవెల్ హైప్ క్రియేట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవల ‘జైలర్’ ఈవెంట్‌లో అనిరుధ్ చేసిన పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘జవాన్’ ఈవెంట్‌లో కూడా అలాంటి ఒక పర్ఫార్మెన్స్ పడితే.. ఈ సినిమా గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారని షారుఖ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ‘జవాన్’ నుంచి విడుదలయ్యింది రెండు పాటలే అయినా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందంటూ అప్పుడే అనిరుధ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Also Read: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్స్ వీరే - ఈ సెలబ్రిటీలను మీరు ఊహించి కూడా ఉండరు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial